ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2022: ముంబై ఎదుట ఓ మోస్తరు లక్ష్యం.. ఢిల్లీ భారం ఇక బౌలర్లపైనే

ABN, First Publish Date - 2022-05-22T03:09:57+05:30

ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు బ్యాట్లు ఝళిపించడంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు బ్యాట్లు ఝళిపించడంలో విఫలమయ్యారు. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచారు. కెప్టెన్ పంత్, రోవ్‌మన్ పావెల్ క్రీజులో ఉన్నప్పుడు పరుగులు పెట్టిన స్కోరు ఆ తర్వాత మందగించింది. మరోవైపు, ముంబై బౌలర్లు ఒత్తిడి పెంచడంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ స్కోరు సాధిస్తుందనుకున్న ఢిల్లీ ఓ మోస్తరు స్కోరు మాత్రమే చేసి బౌలర్లపై భారం వేసింది.


ఢిల్లీ బ్యాటర్లలో రోవ్‌మన్ పావెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 34 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43 పరుగులు చేయగా పంత్ 39 పరుగులు చేశాడు. పృథ్వీషా 24, సర్ఫరాజ్ ఖాన్ 10, అక్షర్ పటేల్ 19(నాటౌట్), శార్దూల్ ఠాకూర్ 4 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బుమ్రాకు 3 వికెట్లు దక్కగా, రమణ్‌దీప్ సింగ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2022-05-22T03:09:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising