ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టాస్ గెలిచిన ముంబై.. గెలుపు అంచనాలు ఇవే..

ABN, First Publish Date - 2022-04-14T00:45:14+05:30

ముంబై : ఐపీఎల్ 2022లో మరో ఉత్కంఠ భరిత మ్యాచ్‌కు తెరలేచింది. పుణె వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఐపీఎల్ 2022లో మరో ఉత్కంఠ భరిత మ్యాచ్‌కు తెరలేచింది. పుణె వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై కేవలం ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మిల్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. రమన్‌దీప్ స్థానంలో మిల్స్ ఆడతాడు.


ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్లు నాలుగు మ్యాచులు చొప్పున ఆడాయి. అందులో ముంబై ఇండియన్స్ అన్నీ మ్యాచ్‌లు ఓడిపోగా.. పంజాబ్ కింగ్స్ రెండు మ్యాచులు గెలిచి.. రెండు మ్యాచుల్లో ఓటమి పాలయ్యారు. ఇక అంచనాల విషయానికి వస్తే.. ముంబై ఇండియన్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ముంబైకి స్టార్ ప్లేయర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో లేకపోవడం జట్టును కలవరపరుస్తోంది. బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటుండడంతో ముంబై ఇండియన్స్ గెలుపు రుచి చూడలేకపోతోంది. కాగా పుణెలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలవ్వగా ఇది మూడవ మ్యాచ్ కానుంది. 


ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే.. చివరిగా గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయ్యారు. చక్కటి టీం ఉన్నప్పటికీ ఆటగాళ్లు సరైన రీతిలో రాణించలేకపోతున్నారు. కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ స్వల్ప స్కోర్లకే పరిమితమవుతున్నాడు. దీంతో మిడిల్, లోయర్ ఆర్డర్‌పై మరింత భారాన్ని పెంచుతోంది. బౌలర్లు కూడా అవసరమైనప్పుడు వికెట్లు తీయలేకపోతున్నారు. స్థిరంగా రాణించడంలో విఫలమవుతున్నారు. ఆటగాళ్లంతా రాణిస్తే మరో గెలుపును ఆస్వాదించడం ఖాయమనే విశ్లేషణలున్నాయి.

Updated Date - 2022-04-14T00:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising