ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోని ఉచ్చులో విరాట్ కోహ్లీ

ABN, First Publish Date - 2022-04-14T01:35:27+05:30

మిస్టర్ కూల్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోని ప్లాన్ వేశాడంటే ప్రత్యర్థి ఆటగాళ్లు ఉచ్చులో పడాల్సిందే. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది నిరూపితమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మిస్టర్ కూల్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోని ప్లాన్ వేశాడంటే ప్రత్యర్థి ఆటగాళ్లు ఉచ్చులో పడాల్సిందే. మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది మరోసారి నిరూపితమైంది. అయితే ఈసారి ధోని ఉచ్చులో పడింది స్వయానా టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీనే. దాదాపు దశాబ్ద కాలంగా విరాట్ కోహ్లీతో మైదానంతోపాటు డ్రెసింగ్ రూం పంచుకున్న ధోని.. విరాట్ ఏ బంతులను ఎలా ఆడతాడో ధోనికి బాగా తెలుసు. అందుకు అనుగుణంగానే గత మ్యాచ్‌లో పక్కా ప్లాన్‌తో ఔట్ చేశాడు.


కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టిన వెంటనే డీప్ స్వేర్ లెగ్‌లో ఫీల్డర్‌ను మోహరించాడు. పుల్ షాట్ ఆడతాడని భావించి ఇందుకు అనుగుణంగా ఫీల్డింగ్ ను సమాయత్తం చేశాడు. అనుకున్నట్టే ముకేష్ చౌదరి విసిరిన తొలి బంతినే కోహ్లీ పుల్ షాట్ ఆడాడు. డీప్ మిడ్ వికెట్‌లో ఉన్న శివమ్ దూబే క్యాచ్‌ను చక్కగా ఒడిసిపట్టాడు. దీంతో విరాట్ బ్యాటింగ్ ముగిసింది. కోహ్లీకి ఎంఎస్ ధోని వేసిన ప్లాన్‌పై ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ధోని చాలా బ్రిలియంట్అం టూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 216 పరుగుల భారీ లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేధించలేకపోయింది. 23 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్ నయా కెప్టెన్ రవీంద్ర జడేజాకు ఎంఎస్ ధోని సంపూర్ణ సహకారం అందిస్తున్నాడు. అవసరమైనప్పుడల్లా సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-14T01:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising