ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుండగుల చేతిలో గాయపడి కోమాలోకి దక్షిణాఫ్రికా యువ క్రికెటర్.. కుటుంబానికి అండగా బోర్డు

ABN, First Publish Date - 2022-06-03T23:50:19+05:30

దక్షిణాఫ్రికా క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలో (Mondli Khumalo)కు ఆ దేశ క్రికెట్ బోర్డు అండగా నిలిచింది. యూకేలో దుండగుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలో (Mondli Khumalo)కు ఆ దేశ క్రికెట్ బోర్డు అండగా నిలిచింది. యూకేలో దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన ఖుమాలో ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. యూకేలోని సౌత్‌మెడ్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఖుమాలోకు మూడో సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడంతో ఖుమాలో కోమాలోకి వెళ్లిపోయాడని.. రక్తపోటు కూడా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మూడు సర్జరీలు చేశామని.. మరొక సర్జరీతో అతనికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉన్నట్లు చెప్పారు. 


ఖుమాలో కోమాలోనే ఉన్నప్పటికి అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు భరోసా ఇచ్చారు. ఖుమాలో కుటుంబ సభ్యులకు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అండగా నిలిచింది. అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించింది. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న బోర్డు.. ఖుమాలో కుటుంబ సభ్యులకు ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపింది. 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో టీ20 అరంగేట్రం చేశాడు. 2020లో అండర్ 19 ప్రపంచ కప్ సౌతాఫ్రికా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఖుమాలోపై దాడి చేసిన వారిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Updated Date - 2022-06-03T23:50:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising