మికిల్ జైశ్వాల్ సెంచరీ
ABN, First Publish Date - 2022-12-15T02:48:06+05:30
మికిల్ జైశ్వాల్ అజేయ శతకం (137)తో సత్తా చాటడంతో తమిళనా డుతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): మికిల్ జైశ్వాల్ అజేయ శతకం (137)తో సత్తా చాటడంతో తమిళనా డుతో రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ స్కోరు చేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 256/5తో రెండోరోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 395 పరుగులు చేసింది. సందీప్ 5 వికెట్లు తీశాడు. అనంతరం తమిళ నాడు.. బుధవారం ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపో కుండా 203 రన్స్ సాధించింది. జగదీశన్ అజేయ శతకం (116)తో రాణించాడు. సుదర్శన్ (87 నాటౌట్) అజేయ అర్ధ సెంచరీ చేశాడు. విజయనగ రంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 238 పరుగులకు ఆలౌట్ కాగా, జవాబుగా ముంబై 290/6 స్కోరు చేసింది.
Updated Date - 2022-12-15T02:48:07+05:30 IST