ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arjun Tendulkar ని ఆడించకపోవడానికి కారణం ఇదే.. నోరు విప్పిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్

ABN, First Publish Date - 2022-06-04T01:33:48+05:30

ఐపీఎల్ 2022(IPL2022) సీజన్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తుది జట్టులో అర్జున్ తెందుల్కర్‌కి చోటుదక్కకపోవడం ఇటివల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ఐపీఎల్ 2022(IPL2022) సీజన్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తుది జట్టులో అర్జున్ తెందుల్కర్‌కి చోటుదక్కకపోవడం ఇటివల పెద్ద చర్చనీయాంశమైంది. మెగా వేలంలో రూ.30 లక్షలకు దక్కించుకున్నా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంకెప్పుడు ఆడిస్తారంటూ ఇటివల సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ నోరు విప్పాడు.


ఆల్ రౌండర్ అర్జున్ తెందుల్కర్ మరింత మెరుగుపడాల్సి ఉందని షేన్ బాండ్ సూచించాడు. ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లపై దృష్టిసారించాలని సలహా ఇచ్చాడు. ముంబై స్వాడ్‌లో కొనసాగడం వేరు.. తుది జట్టులో ఆడడం వేరని కారణాన్ని వివరించాడు. అర్జున్ తెందుల్కర్ ఇంకా కష్టపడాలి. జట్టులో ఆటగాళ్ల మధ్య పోటీ ఉంటుంది. కాబట్టి టీంలో స్థానాన్ని సంపాదించుకోవాలి. జట్టులో చోటు దక్కించుకోవడానికి ముందు అర్జున్ తెందుల్కర్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌లలో రాణించాల్సి ఉందని అన్నాడు. పురోగతిని సాధించి జట్టులో చోటు దక్కించుకోగల సామర్థ్యం అర్జున్ తెందుల్కర్‌కు ఉందని షేన్ బాండ్ నమ్మకం వ్యక్తం చేశాడు.


కాగా 22 ఏళ్ల అర్జున్ తెందుల్కర్‌ని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.30 లక్షలకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. కానీ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం కల్పించలేదు. ఎడమ చేతివాటం కలిగిన ఈ సీమర్ గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ టీంలోనే నెట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 

Updated Date - 2022-06-04T01:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising