ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ ప్రారంభానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2022-03-19T02:47:58+05:30

ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఐపీఎల్ నయా ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ మోచేతి గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ లోపే మార్క్ వుడ్ లక్నోకు దూరమయ్యాడు. గతవారం విండీస్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా వుడ్ కుడి మోచేతికి గాయమైంది.


గత నెలలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో మార్క్‌వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా, విండీస్‌తో జరిగిన టెస్టులో మార్క్ వుడ్ 17 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. లక్నో జట్టుకు టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తుండగా, ఆండీ ఫ్లవర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 

Updated Date - 2022-03-19T02:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising