ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2022 Auction: కోల్‌కతాకు రహానే.. హైదరాబాద్‌‌కు మార్క్రమ్‌.. మోర్గాన్‌, ఫించ్‌, పుజారాకు నిరాశ

ABN, First Publish Date - 2022-02-13T17:56:18+05:30

రెండో రోజు మెగా వేలం ప్రారంభమైంది. వేలంలో తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్‌ వచ్చాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రెండో రోజు మెగా వేలం ప్రారంభమైంది. వేలంలో తొలి ఆటగాడిగా దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రమ్‌ వచ్చాడు. అతడిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 2.6కోట్లకు దక్కించుకుంది. అనంతరం టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానే వేలంలోకి రాగా.. అతడి కనీస ధర రూ.1కోటికి కోల్‌కతా సొంతం చేసుకుంది. అటు మన్‌దీప్ సింగ్‌ను ఢిల్లీ రూ.1.10కోట్లకు దక్కించుకుంది. ఇయాన్ మోర్గాన్, సౌరభ్ తివారీ, డేవిడ్ మలాన్, ఆరోన్ ఫించ్‌, ఛటేశ్వర్ పుజారాలను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.


కాగా, తొలిరోజు వేలంలో మొత్తం 97 మంది క్రికెటర్లు పాల్గొన్నారు. వీరిలో 74 మంది ఆటగాళ్లు అమ్ముడుపోగా... 10 ఫ్రాంచైజీలు సుమారు రూ. 388 కోట్లు వెచ్చించాయి. అయితే ఇంకా జట్లలో అన్ని స్థానాలు భర్తీ కాలేదు. మరో 73 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక 10 జట్ల వద్ద సుమారు రూ. 173 కోట్లు మాత్రమే ఉన్నాయి. అందుకే ఇవాళ్టి వేలంలో ఏ ఆటగాడికి భారీ మొత్తం దక్కే అవకాశం లేదు. అయితే, ఐపీఎల్‌ తొలిరోజు వేలంలో భారత యంగ్‌ప్లేయర్ ఇషాన్‌ కిషన్‌ జాక్‌పాట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇషాన్‌ను ఏకంగా రూ.15.25 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది. 

Updated Date - 2022-02-13T17:56:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising