ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ సమయంలో.. అంతా ఉన్నా..ఒంటరినే!

ABN, First Publish Date - 2022-08-19T09:59:21+05:30

విరాట్‌ కోహ్లీ..సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ తర్వాత భారత క్రికెట్‌లో స్టార్‌గా వెలుగొందుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విరాట్‌ కోహ్లీ..సచిన్‌ టెండూల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోనీ తర్వాత భారత క్రికెట్‌లో స్టార్‌గా వెలుగొందుతున్నాడు. మూడు ఫార్మాట్లలో ఎన్నో రికార్డులను తనపేరిట లిఖించుకున్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌ను అవలోకించుకుంటూ ‘14 సంవత్సరాల కిందట ఇదే రోజు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టా. ఇది నాకు లభించిన అతి గొప్ప గౌరవం’ అని  33 ఏళ్ల కోహ్లీ గురువారం ఉద్వేగంగా స్పందించాడు. అయితే గత మూడు సంవత్సరాలుగా విరాట్‌కెరీర్‌లో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాడు.


రన్‌మెషీన్‌గా పేరు గాంచిన అతడి బ్యాట్‌నుంచి సెంచరీ జాలువారి వేయి రోజులకుపైగానే అయింది ! ఇప్పుడిక ఈనెలాఖరులో ఆరంభమయ్యే ఆసియా కప్‌ టీ20 టోర్నీకి సన్నద్ధమవుతున్నాడు. ఈనేపథ్యంలో క్రీడాకారుడిపై ఉండే ఒత్తిడి, అది చూపే ప్రతికూల ప్రభావాలను విరాట్‌ ఇలా వెల్లడించాడు.‘మానసిక ఒత్తిడితో కలిగే ప్రతికూల ప్రభావాలు ఎలా ఉంటాయో నాకు కూడా తెలుసు. మనల్ని ప్రేమించే, మనకు అండగా నిలిచే వ్యక్తులు ఎంతోమంది మనతోపాటు మన గదిలో ఉన్నా..ఒంటరిననే బాధ వేధించేది. ఒత్తిడిలో ఉండే అందరు అథ్లెట్లకు ఇలాంటి భావనే ఏర్పడుతుంది’ అని చెప్పాడు. 

Updated Date - 2022-08-19T09:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising