ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli: ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్లలో కోహ్లీ ఒకడు: అరోన్ ఫించ్

ABN, First Publish Date - 2022-09-20T01:17:56+05:30

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ అరోన్ ఫించ్ (Aaron Finch) ప్రశంసల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli)పై ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ అరోన్ ఫించ్ (Aaron Finch) ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో కోహ్లీని ఎదుర్కొనేందుకు ప్రత్యర్థులు ఎప్పుడూ పూర్తిస్థాయి సామర్థ్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తుంటారని అన్నాడు. ఆసియాకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీ సాధించిన కోహ్లీ తన సెంచరీల కరువును తీర్చుకున్నాడు.  


ఆసియాకప్ ప్రారంభానికి ముందు కోహ్లీ ఫామ్‌లో లేడు. అయితే, అంతకుముందు అతడు తీసుకున్న చిన్నపాటి విరామం బాగా పనిచేసింది. ఈ టోర్నీలో కోహ్లీ రెండు అర్ధ సెంచరీలు, సెంచరీ సాధించాడు. టోర్నీలో భారత్ తరపున అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.  


కోహ్లీపై ప్రశంసలు కురిపించిన ఫించ్.. గత 15 ఏళ్లుగా తన విజయాలతో ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా నిరూపించుకుంటూనే ఉన్నాడని కొనియాడాడు. కోహ్లీ తన సుదీర్ఘ కెరియర్‌లో తన ఆటను రోజురోజుకు మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడని అన్నాడు. మరీ ముఖ్యంగా 20 క్రికెట్‌లో అతడు బాగా మెరుగయ్యాడని పేర్కొన్నాడు.


విరాట్‌ను ఎదుర్కోవాలంటే తొలుత మనలోని పూర్థిస్థాయి సామర్థ్యాలను వెలికి తీయాల్సి ఉంటుందని అన్నాడు. ఆస్ట్రేలియాపై 19 టీ20లు ఆడిన కోహ్లీ ఆడిన కోహ్లీ 59.83 సగటుతో 718 పరుగులు చేశాడు. ఇందులో ఏడు అర్ధ సెంచరీలున్నాయి. కాగా, ఇటీవల వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫించ్.. టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలన్న పట్టుదలతో ఉన్నాడు.   

Updated Date - 2022-09-20T01:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising