Jyoti Surekha : జ్యోతి సురేఖ.. ఇక డిప్యూటీ కలెక్టర్
ABN, First Publish Date - 2022-12-16T00:17:40+05:30
ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కారు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఆర్చరీ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత వెన్నం జ్యోతి సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయస్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన విజయవాడ అమ్మాయి సురేఖను క్రీడాకారుల కోటాలో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపిక చేస్తూ ఏపీ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులు (జీవో-749) జారీ చేశారు. ఈ ఉత్తర్వు అందిన 30 రోజుల్లోగా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు రిపోర్టు చేయాల్సిందిగా ఆమెకు సూచించారు. 2019లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్రీడాకారుల కోటాలో సురేఖను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దీంతో ఏపీపీఎస్సీ అధికారిక ప్రక్రియలను పూర్తిచేసి గతనెల 22న ఫైలుకు ఆమోదం తెలిపింది.
Updated Date - 2022-12-16T00:17:41+05:30 IST