ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడేజా జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్

ABN, First Publish Date - 2022-04-04T03:05:20+05:30

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల  నష్టానికి 180 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత పంజాబ్ దూకుడు చూసి స్కోరు డబుల్ సెంచరీ దాటుతుందని భావించారు. అయితే, బ్యాటర్లు మరింత జోరుగా ఆడే క్రమంలో వికెట్లను త్వరత్వరగా చేజార్చుకున్నారు.


లియామ్ లివింగ్‌స్టోన్ చెన్నై బౌలర్లను బెంబేలెత్తించాడు. 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులు పిండుకున్నాడు. అతడు క్రీజులో ఉన్నంత వరకు స్కోరు బోర్డు అలుపు లేకుండా పరుగులు తీసింది. లివింగ్‌స్టోన్ దెబ్బకు ముకేశ్ చౌదరి నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు.


శిఖర్ ధవన్ 24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 33 పరుగులు చేశాడు.  జితేష్ రాణా కూడా మెరిశాడు. 17 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. అతడు అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టే వెనుదిరిగారు. ఫలితంగా 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్, ప్రెటోరియస్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, ముకేశ్ చౌదరి, బ్రావో, జడేజా తలా ఓ వికెట్ పడగొట్టారు. 

Updated Date - 2022-04-04T03:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising