ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదే జరిగితే అంతకుమించిన గౌరవం ఇంకేముంటుంది?: టెస్ట్ కెప్టెన్సీపై బుమ్రా

ABN, First Publish Date - 2022-01-18T00:51:52+05:30

టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఇండియా టెస్టు జట్టును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో ఇండియా టెస్టు జట్టును నడిపించేదెవరన్న దానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇదే విషయమై స్పందించిన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టెస్టు కెప్టెన్సీ కనుక తనకు లభిస్తే అంతకుమించిన గౌరవం ఏముంటుందని పేర్కొన్నాడు. అంతేకాదు, జట్టు అవసరాల కోసం పోస్టుతో సంబంధం లేకుండా ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. 


పోస్టు ఉన్నా, లేకున్నా ఇప్పటి వరకు తాను చేయగలిగినంత చేస్తున్నానని బుమ్రా పేర్కొన్నాడు. తనకు కనుక టెస్టు జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే దానిని గౌరవంగా భావిస్తానని పేర్కొన్నాడు. ఒకవేళ అది దక్కకున్నా తన శక్తిమేర రాణించేందుకు ప్రయత్నిస్తానన్నాడు.


కాగా, టెస్టు కెప్టెన్సీ కోసం సెలక్టర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. తనతోపాటు జట్టులోని ఇతర ఆటగాళ్లు మార్పును స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బుమ్రా చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-01-18T00:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising