ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌కు భారీ ధర.. కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్

ABN, First Publish Date - 2022-02-12T22:34:06+05:30

ఐపీఎల్ మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ ఐపీఎల్‌తో అరంగేట్రం చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) జట్టురూ. 8.75 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. అలాగే, క్వింటన్ డికాక్‌‌ను రూ. 6.75 కోట్లకు, మనీష్ పాండేను రూ. 6.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్‌ను కూడా ఆ జట్టు సొంతం చేసుకుంది. 


బెంగళూరులో రెండు రోజులపాటు ఈ వేలం జరగనుండగా, ఈ మధ్యాహ్నం వేలం ప్రారంభమైంది. జాసన్ రాయ్‌ను కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్‌ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఫా డుప్లెసిస్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (ఆర్‌సీబీ) రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. వేలంలో దాదాపు 600 మంది ఆటగాళ్లు పాలుపంచుకుంటున్నారు. 48 ఆటగాళ్ల కనీస ధర రూ. 2 కోట్లు కాగా, 20 మంది ఆటగాళ్లు కనీస ధరను రూ. 1.5 కోట్లు, 34 మంది ఆటగాళ్ల కనీస ధర కోటి రూపాయలుగా ఉంది. ఆటగాళ్లలో 377 మంది ఇండియన్ ప్లేయర్లు కాగా, 223 మంది విదేశీ ఆటగాళ్లు పాలుపంచుకుంటున్నారు.  


Updated Date - 2022-02-12T22:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising