ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ireland vs India: సెంచరీతో చెలరేగిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ టార్గెట్..

ABN, First Publish Date - 2022-06-29T04:22:52+05:30

ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి ఏడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. సంజూ శాంసన్ కూడా 77 పరుగులతో జట్టు స్కోర్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మలహిడే (డబ్లిన్‌): ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి ఏడు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. దీపక్ హుడా సెంచరీతో చెలరేగాడు. సంజూ శాంసన్ కూడా 77 పరుగులతో జట్టు స్కోర్‌లో కీలక పాత్ర పోషించాడు. 228 పరుగుల లక్ష్యాన్ని ఐర్లాండ్ జట్టు ముందు ఉంచింది. ఇషాన్ కిషన్ 3 పరుగులకే చేతులెత్తేశాడు. సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా చెరో 15 పరుగులు చేశారు. దినేష్ కార్తీక్, అక్సర్ పటేల్, హర్షల్ పటేల్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడెయిర్ 3 వికెట్లతో రాణించగా, లిటిల్, క్రైగ్ యంగ్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.



తొలి టీ20 వర్షం కారణంగా పూర్తి స్థాయిలో జరగలేకపోయింది. దీంతో భారత యువ ఆటగాళ్లు సరైన రీతిలో అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. వచ్చే నెలలో భారత జట్టు ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడాల్సి ఉంది. సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు యువ క్రికెటర్లకు ఇదే చివరి అవకాశం. ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉన్న పాండ్యా సేన ఆఖరి మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ను దక్కించుకోవాలనుకుంటోంది. ప్రత్యర్థితో ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమిండియా అజేయంగా ఉంది. ఇక భారత్‌లాంటి జట్లతో అరుదుగా పోటీపడే అవకాశం దక్కుతుంది కాబట్టి ఐర్లాండ్‌ ఈ మ్యాచ్‌లోనైనా గట్టి పోటీ ఇవ్వాలనుకుంటోంది. తొలి పోరులో హ్యారీ టెక్టర్‌ సూపర్‌ షో అందరినీ ఆకట్టుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ఆటంకం కలిగించే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బ్యాటింగ్‌ అంచనాలకు మించే సాగింది. ఆరంభంలో వికెట్ల పతనం తీరు చూస్తే 100 దాటడం కూడా కష్టమే అనిపించింది. కానీ టెక్టర్‌ ధాటికి స్కోరుబోర్డు పరిగెత్తింది. అతడి అద్భుత షాట్లకు భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. ఈ మ్యాచ్‌లోనూ అందరి దృష్టి అతడిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు.

Updated Date - 2022-06-29T04:22:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising