ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైనల్‌ బెర్త్‌ ఎవరిదో?

ABN, First Publish Date - 2022-05-24T09:45:51+05:30

అంచనాలకు మించి రాణిస్తూ ఐపీఎల్‌ అరంగేట్రంలోనే ప్లేఆ్‌ఫ్సకు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌ అదే జోరు కొనసాగిస్తుందా? లేక ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టి రెండో స్థానంలో నిలిచిన రాజస్థాన్‌ జట్టు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు తొలి క్వాలిఫయర్‌ 

గుజరాత్‌-రాజస్థాన్‌ పోరు

రాత్రి 7.30 నుంచి

స్టార్‌ స్పోర్ట్స్‌లో..

కోల్‌కతా: అంచనాలకు మించి రాణిస్తూ ఐపీఎల్‌ అరంగేట్రంలోనే ప్లేఆ్‌ఫ్సకు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌ అదే జోరు కొనసాగిస్తుందా? లేక ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టి రెండో స్థానంలో నిలిచిన రాజస్థాన్‌ జట్టు టైటాన్స్‌కు షాకిస్తుందా? మంగళవారం జరిగే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఈ ప్రశ్నలకు సమాధానం లభించనుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో హోరాహోరీ తప్పదు. ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్‌ ఆడి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. 


‘తొలి’ బ్యాటింగ్‌లో తడబాటు:

ఇక కెప్టెన్‌గా ఎలాంటి అనుభవం లేకున్నా హార్దిక్‌ పాండ్యా టైటాన్స్‌ను అద్వితీయంగా నడిపించాడు. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఈ జట్టు 10 విజయాలతో టాప్‌లో నిలిచింది. అయితే మొదట బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మాత్రం జట్టులో తడబాటు కనిపిస్తోంది. ఆ జట్టుకు ఏడుసార్లు ఛేజింగ్‌లోనే విజయాలు రాగా, ఇందులో ఆరుసార్లు ఆఖరి ఓవర్‌లోనే గట్టెక్కింది. ఓపెనర్‌ సాహా ఫామ్‌లో ఉండగా, గిల్‌ ఇబ్బందిపడుతున్నాడు. మిడిలార్డర్‌లో హార్దిక్‌, మిల్లర్‌, తెవాటియా, రషీద్‌  సూపర్‌ ఫినిషర్లుగా పేరు తెచ్చుకున్నారు. పేసర్లు షమి, ఫెర్గూసన్‌ కీలకం కానున్నారు.


ఓపెనర్లు అదరగొడితే..:

రాజస్థాన్‌ ఓపెనర్లు జైస్వాల్‌, బట్లర్‌ విరుచుకుపడితే టైటాన్స్‌కు కష్టాలు తప్పవు. అయితే ఇటీవలి మ్యాచ్‌ల్లో బట్లర్‌ విఫలమవుతున్నాడు. కెప్టెన్‌ శాంసన్‌ ఎక్కువసేపు క్రీజులో ఉండాల్సిందే. అలాగే దేవ్‌దత్‌, హెట్‌మయెర్‌, పరాగ్‌ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయమే. స్పిన్నర్లు చాహల్‌, అశ్విన్‌ ప్రత్యర్థి పనిపట్టేందుకు ఎదురుచూస్తున్నారు. బౌల్ట్‌, ప్రసిద్ధ్‌, మెక్‌కాయ్‌ డెత్‌ ఓవర్లలో ధారాళంగా పరుగులిస్తుండడం జట్టుకు రాజస్థాన్‌ను ఆందోళనపరుస్తోంది. ఇదిలావుండగా రాజస్థాన్‌ జట్టు ఈడెన్‌ గార్డెన్స్‌లో ఇప్పటివరకూ ఆడిన 9 మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే గెలిచింది.  

Updated Date - 2022-05-24T09:45:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising