ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2008 తర్వాత విరాట్ కోహ్లీకి తొలిసారి.. పీడకలలా IPL 2022

ABN, First Publish Date - 2022-04-28T00:06:01+05:30

ముంబై : ప్రపంచ క్రికెట్‌ యవనికపై తనదైన ముద్రవేశాడు ఇండియన్ స్టార్ విరాట్ కోహ్లీ. క్రీజులోకి వస్తున్నాడంటే తన జట్టుకు భరోసా.. ప్రత్యర్థి బౌలర్లకు దడ.. రెచ్చిగొడితే మరింత కసితో ఆడతత్వం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ప్రపంచ క్రికెట్‌ యవనికపై తనదైన ముద్రవేశాడు ఇండియన్ స్టార్ virat kohli. క్రీజులోకి వస్తున్నాడంటే తన జట్టుకు భరోసా.. ప్రత్యర్థి బౌలర్లకు దడ.. రెచ్చగొడితే మరింత కసితో ఆడేతత్వం. టన్నుల కొద్దీ పరుగులు, లెక్కలేనన్ని రికార్డులు, అవలీలగా సాధించిన సెంచరీలు కోహ్లీ సత్తాకి నిదర్శనం. కానీ పాత కోహ్లీ ఇప్పుడు కనిపించడం లేదు. మునుపటిలా ఆడలేకపోతున్నాడు, ఆకట్టుకోలేకపోతున్నాడు. అత్యంత పేలవ ప్రదర్శనతో క్రికెట్ అభిమానాలను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మంచిగా ఆడతాడనే నమ్మకం కంటే ఎప్పుడు ఔటవుతాడోననే భయమే ఫ్యాన్స్‌ను ఎక్కువగా వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రస్తుత IPl season 2022లో మరింత చెత్తగా ఆడుతున్నాడు. royal challengers bangaluru అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.


ప్రస్తుత ఐపీఎల్ 2022 సీజన్‌ విరాట్ కోహ్లీకి పీడకలలా మారింది. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన విరాట్ కేవలం 129 పరుగులు మాత్రమే చేయగలిగాడు.  అత్యంత పేలవ ప్రదర్శన కారణంగా ఈ సీజన్‌లో అతడి సగటు స్కోరు 16 పరుగులుగా  మాత్రమే ఉంది. ఇక స్ట్రైక్ రేట్ కూడా అత్యంత చెత్తగా 119.63 గా ఉంది. గత 10 ఐపీఎల్ సీజన్లలో ఇది రెండవ అతి చెత్త రికార్డ్‌గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఆ సీజన్‌లో చివరిగా ఆడిన 3 మ్యాచుల్లో విరాట్ స్కోర్లు 0, 0, 9 పరుగులుగా ఉన్నాయి. ఈ సీజన్ ఇప్పటివరకు రెండు సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అంటే ఆడిన తొలి బంతికే వికెట్ సమర్పించి పెవిలియన్ చేరాడు. కాగా ఇంతకంటే దారుణ ప్రదర్శన చివరిసారిగా ఐపీఎల్ 2008 సీజన్‌లో నమోదయింది.  రవిశాస్త్ర, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజాలు ఎప్పటి నుంచో విరాట్ కోహ్లీకి సూచనలు చేస్తున్నారు. ప్రదర్శన మెరుగుపరచుకోవాలని సలహాలిస్తున్నారు. అయినప్పటికీ కోహ్లీ బ్యాటింగ్ తీరులో పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు. అసలు ఈ  సీజన్‌లో తిరిగి ఫామ్‌లోకి వస్తాడా? లేక ఇంకెంతకాలం ఎదురుచూడాలి? అనే ప్రశ్నార్థకంగా మారింది.  

Updated Date - 2022-04-28T00:06:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising