ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

LSG vs RCB: ఎలిమినేటర్ మ్యాచ్ కోసం వెయిటింగా.. టాస్ ఇంకా ఎందుకు పడలేదంటే..

ABN, First Publish Date - 2022-05-26T01:22:00+05:30

ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాత్రి 7.30 గంటలకు మొదలు కావాల్సిన LSG vs RCB మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగులుతున్నాడు. భారీ వర్షం కాకపోయినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కత్తా: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాత్రి 7.30 గంటలకు మొదలు కావాల్సిన LSG vs RCB మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగులుతున్నాడు. భారీ వర్షం కాకపోయినా చిన్నపాటి చినుకులు పడుతుండటంతో మ్యాచ్ ఇంకా మొదలుకాలేదు. రాత్రి 7 గంటలకు టాస్ పడాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా ఆలస్యమయింది. గ్రౌండ్ మొత్తాన్ని కవర్స్‌తో కప్పేశారు. పెద్ద వర్షం కాకపోవడంతో ఓవర్లను కుదించడం గానీ, సూపర్ ఓవర్ వరకూ గానీ పరిస్థితి వెళ్లకపోవచ్చు. ఆలస్యంగానైనా పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మ్యాచ్ సూపర్ ఓవర్ వరకూ వెళుతుందా లేక ఆలస్యంగానైనా మొదలవుతుందా అనే ప్రశ్నకు వరుణుడే సమాధానం చెప్పాలి.



ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో ఇరు జట్ల అభిమానులు పెద్ద ఎత్తున మ్యాచ్‌ను వీక్షించేందుకు వెళ్లారు. రెండు జట్లు బలమైనవే కావడంతో ఎవరు విజేతగా నిలుస్తారనే విషయాన్ని తేల్చడం అంత సులభం కాదు. దినేష్ కార్తీక్ లాంటి Game Changers రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. గతంతో పోల్చితే బెంగళూరు ఎంతో సమతుల్యమైన జట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాజెల్‌వుడ్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌లతో బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది. టాపార్డర్‌లో విరాట్‌ టచ్‌లోకి రావడం పెద్ద సానుకూలాంశం కాగా.. ఫినిషర్‌గా దినేష్‌ కార్తీక్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మ్యాక్స్‌వెల్‌ స్థాయికి తగ్గ ఆటను ఇంకా ప్రదర్శించలేదు.



మరోవైపు నిలకడైన ప్రదర్శనతో లఖ్‌నవూ ఆకట్టుకుంటోంది. యువ పేసర్లు అవేశ్‌ ఖాన్‌, మొహిసిన్‌ ఖాన్‌ జట్టుకు ప్రధాన బలంగా మారగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు కెప్టెన్‌ రాహుల్‌, డికాక్‌ మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. క్రునాల్‌, స్టొయినిస్‌ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతో ఉంది. బెంగళూరు ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధించి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడే వరకూ రావడం ఇది వరుసగా మూడోసారి. ఈసారైనా ఎలిమినేటర్ మ్యాచ్‌లో నిష్క్రమించే శాపం నుంచి బెంగళూరు జట్టు బయటపడుతుందో లేదో చూడాలి. ఇదిలా ఉండగా.. తాజాగా అందిన సమాచారం ఏంటంటే.. చినుకులు పడటం ఆగింది. గ్రౌండ్‌పై కప్పిన కవర్లను కూడా మరికొద్ది సేపట్లో తీసేయబోతున్నారు. టాస్‌ పడేందుకు మరెంతో సమయం పట్టేలా లేదు.

Updated Date - 2022-05-26T01:22:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising