ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2022 చాంపియన్స్ గుజరాత్‌ టైటాన్స్‌ను సత్కరించిన ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్

ABN, First Publish Date - 2022-05-31T02:07:18+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) విజేతగా అవతరించిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టును ఆ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) విజేతగా అవతరించిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఓపెన్ టాప్ బస్‌పై రోడ్‌షోగా వచ్చిన హార్దిక్ పాండ్యా జట్టుకు అభిమానులు జేజేలు పలికారు. అభిమానులతో అహ్మదాబాద్ వీధులు కిక్కిరిసిపోయాయి.


ఉస్మాన్‌పురా రివర్ ఫ్రంట్ నుంచి బయలుదేరిన రోడ్ షో విశ్వకుంజ్ రివర్‌ఫ్రంట్ వద్ద ముగిసింది. జట్టు సారథి హార్దిక్ పాండ్యా, కోచ్ ఆశిష్ నెహ్రా, జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్‌ను గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ సత్కరించారు. ఐపీఎల్ ట్రోఫీని హార్దిక్ పాండ్యా పట్టుకుని అభిమానులకు చూపిస్తున్న వీడియోను శుభమన్ గిల్ షేర్ చేశాడు. ఈ రోడ్‌ షోకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.


అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ ఒకే మ్యాచ్ అడింది. స్టేడియంలో లక్షమంది ప్రేక్షకుల ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా, హోం ఫ్యాన్స్‌ ముందు ఆడి టైటిల్ గెలిచిన రెండో జట్టుగా గుజరాత్ టైటాన్స్ రికార్డులకెక్కింది. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ సొంత అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది.  

Updated Date - 2022-05-31T02:07:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising