ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లైంగిక దుష్ప్రవర్తన.. Indian U-17 women's football team అసిస్టెంట్ కోచ్‌పై వేటు

ABN, First Publish Date - 2022-07-04T21:15:00+05:30

లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత అండర్-17 ఫుట్‌బాల్ జట్టు అసిస్టెంట్ కోచ్ అలెక్స్ ఆంబ్రోస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత అండర్-17 ఫుట్‌బాల్ జట్టు అసిస్టెంట్ కోచ్ అలెక్స్ ఆంబ్రోస్‌ (Alex Ambrose)పై వేటు పడింది. యూరప్ పర్యటనలో భారత జట్టులోని ఓ ప్లేయర్‌తో ఆంబ్రోస్‌ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనను తొలగించడమే కాకుండా నార్వే(Norway) నుంచి ఆయనను వెనక్కి పిలిపించినట్టు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ బాధ్యతలు చూస్తున్న సుప్రీంకోర్టు నియమతి కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషటర్స్ (CoA) సభ్యుడు ఎస్‌వై ఖురేషి తెలిపారు. ఆంబ్రోస్‌పై తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.


ఈ ఏడాది అక్టోబరు 11-30 మధ్య జరగనున్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ (FIFA U-17 Women's World Cup)కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు ప్రస్తుతం యూరప్‌లో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్లేయర్‌తో అసిస్టెంట్ కోచ్ అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన హెడ్ కోచ్ థామస్ డెనెర్బీ వెంటనే ఆ విషయాన్ని ఏఐఎఫ్ఎఫ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనను అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పించడమే కాకుండా వెంటనే నార్వే నుంచి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2022-07-04T21:15:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising