ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Thomas Cupలో భారత్‌కు స్వర్ణ కిరీటం.. ఇండినేషియా చిత్తు

ABN, First Publish Date - 2022-05-15T22:02:56+05:30

థామస్ కప్‌లో భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. తొలుత సెమీస్‌లోకి, ఆపై ఫైనల్స్‌కి దూసుకెళ్లి రికార్డులకెక్కిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: థామస్ కప్‌లో భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. తొలుత సెమీస్‌లోకి, ఆపై ఫైనల్స్‌కి దూసుకెళ్లి రికార్డులకెక్కిన భాతర పురుషుల బ్యాడ్మింటన్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్‌లో 14 సార్లు చాంపియన్ అయిన ఇండోనేషియాను ఆదివారం 3-0తో చిత్తు చేసి చారిత్రక విజయాన్ని అందుకుంది. ఫలితంగా దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించింది.


73 ఏళ్ల థామస్, ఉబెర్ కప్ చరిత్రలో భారత్ ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి. అంతేకాదు, చైనా, ఇండోనేషియా, జపాన్, డెన్మార్క్, మలేషియా తర్వాత థామస్ కప్ టైటిల్ సాధించిన ఆరో దేశంగానూ భారత్ రికార్డులకెక్కింది. చారిత్రక విజయం తర్వాత భారత శిబిరంలో సంబరాలు హోరెత్తాయి.

 

భారత షట్లర్లు లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ షెట్టీ, కిదాంబి శ్రీకాంత్ 3-0తో చారిత్రాత్మక విజయం సాధించడంతో భారత్‌కు రెండో డబుల్స్ మ్యాచ్, మూడో సింగిల్స్ మ్యాచ్ అవసరం లేకుండా పోయింది. ఇండోనేషియాను చిత్తు చేసిన భారత్ స్వర్ణ పతకం సాధించగా, ఇండోనేషియా రజత పతకంతో సరిపెట్టుకుంది. డెన్మార్క్, జపాన్ కాంస్య పతకం సాధించాయి.  థామస్ కప్‌లో భారత్ అద్భుత విజయం సాధించడంపై కేంద్రం క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. టీమిండియాకు కోటి రూపాయల రివార్డు ప్రకటించారు. 





Updated Date - 2022-05-15T22:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising