ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian cricketer: రిషబ్ పంత్‎కి రోడ్డు ప్రమాదం..

ABN, First Publish Date - 2022-12-30T09:14:47+05:30

భారత క్రికెటర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‎కి రోడ్డు ప్రమాదం జరిగింది. రూర్కీ దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్‎ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూర్కీ: భారత క్రికెటర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‎కి(Indian cricketer wicket keeper Rishabh Pant) రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. రూర్కీ దగ్గర పంత్ కారు అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‎కి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రిషబ్‎ను వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది(Fire crew) మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు చెలరేగిన సమయంలో పంత్(Pant) కారులో(Car) లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రూర్కీ నుంచి ఢిల్లీకి(Roorkee to Delhi) వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

బంగ్లాదేశ్‎తో ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‎లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. జనవరిలో జరగబోయే శ్రీలంకతో సిరీస్‎కు పంత్‎ను సెలక్షన్ టీమ్ ఎంపిక చేయలేదు. మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి రిషబ్ పంత్ దుబాయ్‎లో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-12-30T09:32:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising