ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేను జట్టుకు బలమే..

ABN, First Publish Date - 2022-08-10T06:00:01+05:30

భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వన్డేలకు ఆదరణ ఉంది

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కనిపిస్తున్నాడు. పొట్టి ఫార్మాట్‌లోనూ ధాటిగా ఆడే సత్తా ఉన్నప్పటికీ 36 ఏళ్ల గబ్బర్‌ పేరును సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపడమే దీనికి కారణం. అయితే కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడడాన్ని తానేమీ తక్కువగా చూడడం లేదని, జట్టుకు తాను బలమేనంటూ ధవన్‌ స్పష్టం చేశాడు. 2020 నుంచి ఇటీవల వెస్టిండీ్‌సలో వన్డే సిరీస్‌ వరకు ఈ ఓపెనర్‌ 22 మ్యాచ్‌ల్లో 975 పరుగులు సాధించాడు. ఇందులో 10 అర్ధసెంచరీలు ఉండడం విశేషం. ‘ఈ ఫార్మాట్‌ను  క్షుణ్ణంగా అర్థం చేసుకున్నా కాబట్టే పరుగులు వస్తున్నాయి. ఈక్రమంలో టెక్నిక్‌ను మార్చుకునేందుకు కఠోరంగా శ్రమించా. టీ20 జోరు కొనసాగుతున్నా.. వన్డేలకు ఇంకా ఆకర్షణ ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు నా శరీరం సహకరిస్తుందా? లేదా? అనే విషయమే నాకు కావాల్సింది. ఆటలో కొనసాగినంత కాలం జట్టుకు బలంగా ఉండాలనే భావిస్తా, కానీ భారంగా మాత్రం కాదు’ అని ధవన్‌ తెలిపాడు. జింబాబ్వేతో పాటు అక్టోబరులో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీ్‌సకు కూడా ధవన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించే చాన్సుంది.

Updated Date - 2022-08-10T06:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising