ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరామర్శకు తీరిక లేదు.. పార్టీకి మాత్రం రెడీ

ABN, First Publish Date - 2022-09-25T09:21:26+05:30

భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 టిక్కెట్ల కోసం జింఖానాలో గంటల కొద్ది నిలబడి తొక్కిసలాటలో దారుణంగా గాయపడిన ఏడుగురు బాధితులను కనీసం ఆస్పత్రికెళ్లి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత్‌-ఆస్ట్రేలియా మూడో టీ20 టిక్కెట్ల కోసం జింఖానాలో గంటల కొద్ది నిలబడి తొక్కిసలాటలో దారుణంగా గాయపడిన ఏడుగురు బాధితులను కనీసం ఆస్పత్రికెళ్లి పరామర్శించడానికి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రతినిధులకు తీరిక లేదు. కానీ, శనివారం రాత్రి నగరంలోని ఒక విలాసవంతమైన హోటల్లో లక్షల్లో బిల్లులు చెల్లించి పార్టీలు చేసుకోవడానికి మాత్రం సమయం ఉంది. ప్రజాధనంతో పోగేసుకున్న హెచ్‌సీఏ నిధులతో అధ్యక్షుడు మహ్మద్‌ అజరుద్దీన్‌ క్లబ్‌ సెక్రటరీలు, తన అనుచర గణానికి పెద్ద పార్టీనే ఇచ్చాడు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా తననే అధ్యక్షుడిగా మరోసారి గెలిపించాలని ఈ పార్టీలో అతడు క్లబ్‌ సెక్రటరీలందరిని కోరినట్టు సమాచారం. ఒక పక్క మ్యాచ్‌ ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు.. అయినా హెచ్‌సీఏ ప్రతినిధులు పార్టీలో మద్యం సేవిస్తూ వేడుక చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-09-25T09:21:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising