ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైనల్లో భారత్‌

ABN, First Publish Date - 2022-10-29T05:34:57+05:30

భారత హాకీ కుర్రాళ్లు సుల్తాన్‌ జొహర్‌ కప్‌ జూనియర్‌ టోర్నమెంట్‌లో అదరగొట్టారు. ఈ మెగా టోర్నమెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు ఆసీస్ తో భారత్‌ ఢీ

సుల్తాన్‌ జొహర్‌ కప్‌ హాకీ

జొహర్‌ (మలేసియా): భారత హాకీ కుర్రాళ్లు సుల్తాన్‌ జొహర్‌ కప్‌ జూనియర్‌ టోర్నమెంట్‌లో అదరగొట్టారు. ఈ మెగా టోర్నమెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ గ్రేట్‌ బ్రిటన్‌తో శుక్రవారం జరిగిన తమ చివరి రౌండ్‌రాబిన్‌ లీగ్‌ పోరును భారత్‌ 5-5తో డ్రా చేసుకుంది. భారత్‌ తరఫున శారదానంద్‌ (56వ, 58వ) రెండు గోల్స్‌తో అదరగొట్టగా.. పూవన్న (7వ), అమన్‌దీప్‌ (50వ), అరైజిత్‌ సింగ్‌ (53వ) తలో గోల్‌ సాధించారు. బ్రిటన్‌ జట్టులో మ్యాక్స్‌ ఆండర్సన్‌ (1వ, 40వ), జేమీ గోల్డెన్‌ (54వ, 56వ) చెరో రెండు గోల్స్‌ కొట్టగా.. మరో గోల్‌ను హారిసన్‌ స్టోన్‌ (42వ) చేశాడు. దీంతో భారత్‌.. మొత్తం మ్యాచ్‌లాడి ఎనిమిది పాయింట్లతో రెండోస్థానంలో నిలిచింది. ఇక ఇదివరకే ఫైనల్‌ చేరిన ఆస్ట్రేలియా శుక్రవారం తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 6-1తో దక్షిణాఫ్రికాను ఓడించింది. తద్వారా ఆసీస్‌.. ఐదు మ్యాచ్‌లకుగాను 13 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రెండోస్థానంతో ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న భారత్‌.. శనివారం జరిగే ఆఖరిఫైట్‌లో ఆసీ్‌సతో తలపడనుంది. బ్రిటన్‌, జపాన్‌ చెరో 7 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాలు.. దక్షిణాఫ్రికా 6 పాయింట్లతో ఐదోస్థానం దక్కించుకున్నాయి. మలేసియా ఒక్క పాయింట్‌తో చివరిస్థానంతో సరిపెట్టుకుంది.

Updated Date - 2022-10-29T05:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising