ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్లీన్‌స్వీప్ లక్ష్యంగా..

ABN, First Publish Date - 2022-07-27T10:01:28+05:30

ఒకటి కాదు.. రెండు కాదు.. వెస్టిండీ్‌సపై వరుసగా 12 వన్డే సిరీ్‌సలు గెలిచిన విజయోత్సాహంలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు ఇప్పుడు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చివరి వన్డే బరిలో భారత్‌

 విండీస్ కు ఓదార్పు దక్కేనా?

రాత్రి 7 గం. నుంచి డీడీ స్పోర్ట్స్‌లో.. 


పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌: ఒకటి కాదు.. రెండు కాదు.. వెస్టిండీస్ పై వరుసగా 12 వన్డే సిరీస్ లు గెలిచిన విజయోత్సాహంలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు ఇప్పుడు తాజా సిరీస్ నుక్లీన్‌స్వీప్ చేయాలనుకుంటోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తొలి రెండు వన్డేల్లో భారత్‌ ఆఖరి ఓవర్‌లో గట్టెక్కి 2-0తో సిరీ్‌సను దక్కించుకుంది. ఓసారి బౌలింగ్‌, మరోసారి బ్యాటింగ్‌ ప్రతిభతో ధవన్‌ సేన విండీస్‌ ఆశలను ఆవిరి చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం   సిరీస్ లోని ఆఖరి మ్యాచ్‌ జరగనుంది. ఇక.. విండీస్‌ ఎలాగైనా ఈ మ్యాచ్‌ను కాపాడుకోవాలనుకుంటోంది. అదే జరిగితే ఈ ఫార్మాట్‌లో తమ వరుస 8 ఓటములకు బ్రేక్‌ పడుతుంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించే చాన్సుంది.


మార్పులుంటాయా?:

నామమాత్రమైన చివరి వన్డేలో రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షిస్తారా? లేక విన్నింగ్‌ కాంబినేషన్‌ను కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరం. ఓపెనర్‌గా గిల్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకుని తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు.   దక్షిణాఫ్రికాతో సిరీ్‌సలో రుతురాజ్‌ తనకు దక్కిన అవకాశాలను వృథా చేసుకోవడం దెబ్బతీసింది. దీంతో గిల్‌ బెర్త్‌ దక్కించుకుని ఫామ్‌ను నిరూపించుకున్నాడు. చివరి మ్యాచ్‌లో శ్రేయాస్‌, శాంసన్‌ హాఫ్‌ సెంచరీలతో మెరవగా.. సూర్యకుమార్‌, దీపక్‌ హుడా ఆశించిన మేర రాణించడం లేదు. ఇది మధ్య ఓవర్లలో పరుగులపై ప్రభావం చూపిస్తోంది. సూర్య స్థానంలో ఇషాన్‌ కిషన్‌ను ఆడిస్తారా అనేది చూడాలి. గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన ఆల్‌రౌండర్‌ జడేజా వస్తే.. అక్షర్‌ పటేల్‌ బెంచ్‌కే పరిమితమవుతాడు. ఇద్దరు లెఫ్టామ్‌ స్పిన్నర్లను ఆడించాలనుకుంటే చాహల్‌కు ఉద్వాసన తప్పదు. అటు పేస్‌ విభాగంలో అవేశ్‌ ఖాన్‌ ధారాళంగా పరుగులివ్వడంతో ప్రసిద్ధ్‌, అర్ష్‌దీ్‌పలో ఒకరికి చాన్స్‌ దక్కొచ్చు.


సమష్టిగా రాణిస్తేనే..:

విండీస్‌ ఈ  సిరీస్ లో 0-2తో వెనుకంజలో ఉన్నా గత మ్యాచుల్లో వారి పోరాటం ఆకట్టుకుంది. భారత బౌలింగ్‌ను ఎదుర్కొంటూ బ్యాటింగ్‌లో పూర్తి ఓవర్లు ఆడగలిగారు. అంతేకాకుండా విజయం అంచుల వరకూ వచ్చి ధవన్‌ సేనను వణికించారు. జట్టు పటిష్టంగానే కనిపిస్తున్నా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది.  

Updated Date - 2022-07-27T10:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising