ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India Vs pakistan Asia Cup 2022: పాక్‌పై మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ స్పందన ఇదీ.. ఫుల్ క్లారిటీగా చెప్పేశాడు..

ABN, First Publish Date - 2022-08-28T23:15:33+05:30

గతేడాది టీ20 వరల్డ్ కప్‌(T20 World cup)లో పాకిస్తాన్(Pakistan) చేతిలో టీమిండియా(India) ఘోర పరాజయం తర్వాత ఇరుజట్లూ మళ్లీ ఇప్పుడే తలపడబోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్ : గతేడాది టీ20 వరల్డ్ కప్‌(T20 World cup)లో పాకిస్తాన్(Pakistan) చేతిలో టీమిండియా(India) ఘోర పరాజయం తర్వాత ఇరుజట్లూ మళ్లీ ఇప్పుడే తలపడబోతున్నాయి. ఆసియా కప్‌-2022(asia cup)లో భాగంగా దుబాయ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్(India Vs Pakistan) మ్యాచ్‌పై వెలుపల భారీగా హైప్ క్రియేట్ చేస్తున్నా.. తాను మాత్రం మ్యాచ్‌పైనే ఫోకస్ చేస్తానని చెప్పాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఫలితం ఆధారంగా ఆసియా కప్‌లో పాక్‌పై ఆడబోయే జట్టు కూర్పు ఉండబోదని రోహిత్ తేల్చిచెప్పాడు. త్వరలోనే ఆరంభమవనున్న టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తామని చెప్పాడు. ఆసియా కప్‌లో వేర్వేరు కాంబినేషన్లను పరీక్షిస్తామని వివరించారు.


బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో ప్రత్యమ్నాయాల అన్వేషణలో భయపడబోమని రోహిత్ క్లారిటీగా చెప్పాడు. ఇదొక కొత్త టోర్నమెంట్ కాబట్టి కొత్త పంథాలో వ్యవహరిస్తామని, గత ఓటమి ప్రభావం ఇప్పుడేమీ పనిచేయబోదని అన్నాడు. మరో 2 నెలల్లోనే టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవనుండడంతో ఫైనల్ 15 స్క్వాడ్‌ను ఖరారు చేసుకోవాల్సి ఉంటుందన్నాడు. ప్రయోగాలకు ఆస్కారం ఉంటుందని సంకేతాలిచ్చాడు. కొన్ని ప్రయోగాలు చేస్తామని, వాటిలో కొన్ని పనిచేస్తే.. మరికొన్ని పనిచేయకపోవచ్చునని పేర్కొన్నాడు. ఆటగాళ్ల అన్వేషణకు సంబంధించి గత 8 నెలల్లో కొన్ని కీలక సమాధానాలు దొరికాయని దీమా వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-08-28T23:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising