ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చారిత్రక వన్డేలో భారత్ పేరున బోల్డన్ని రికార్డులు

ABN, First Publish Date - 2022-02-07T02:59:58+05:30

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుత విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 177 పరుగుల విజయ లక్ష్యాన్ని 28 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్‌కు ఇది చారిత్రక మ్యాచ్ అయిన ఇందులో భారత జట్టు తరపున పలు రికార్డులు నమోదయ్యాయి.


భారత్‌కు ఇది వెయ్యో వన్డే. ఈ చారిత్రక వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. అంతేకాదు, 1000 వన్డేలు ఆడిన ఏకైక జట్టుకు కూడా భారత్ ఒక్కటే. ఈ మ్యాచ్‌కు ఇంకో విశేషం కూడా ఉంది. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మకు ఇది తొలి వన్డే.


ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న రోహిత్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే జట్టుకు అపురూప విజయం అందించాడు. అలాగే, అర్ధ సెంచరీ కూడా సాధించాడు. మరోవైపు, యుజ్వేంద్ర చాహల్ కూడా ఈ వన్డేతో ఓ ర ికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన చాహల్.. తీసిన తొలి వికెట్‌తోనే వంద వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. అత్యంత వేగంగా 100 వికెట్లు సాధించిన రెండో భారత స్పిన్నర్‌గా, ఓవరాల్‌గా ఐదో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.  

Updated Date - 2022-02-07T02:59:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising