ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Commonwealth Games: భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

ABN, First Publish Date - 2022-07-31T21:27:27+05:30

కామన్వెల్త్ క్రీడల్లో (commonwealth games) భాగంగా భారత్-పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య ప్రారంభం కావాల్సిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో (commonwealth games) భాగంగా భారత్-పాకిస్థాన్ మహిళల జట్ల మధ్య ప్రారంభం కావాల్సిన టీ20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం కురుస్తుండడంతో టాస్ ఆలస్యంగా పడేలా కనిపిస్తోంది. గ్రూప్-ఎలో భాగంగా ఈ నెల 29న ఆస్ట్రేలియా (australia)తో జరిగిన తొలి మ్యాచ్‌లో చేతికి అందివచ్చిన విజయాన్ని చేజార్జుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ (harmanpreeth kaur) సేన.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఖాతా తెరవాలని గట్టి పట్టుదలగా ఉంది. మరోవైపు, పాకిస్థాన్‌‌కు తొలి మ్యాచ్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓడింది. దీంతో రెండు జట్లు ఖాతా తెరవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనున్నాయి. కాబట్టి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.


బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ చిన్నచిన్న లోపాలు జట్టును వేధిస్తున్నాయి. ఆస్ట్రేలియాతో గెలుపు ఖాయమని అనుకున్న వేళ చివరిమెట్టుపై బోల్తాపడి పరాజయం పాలైంది. మరోవైపు, పాకిస్థాన్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు రెండింటిలోనూ తీవ్రమైన లోపాలు ఆ జట్టును వేధిస్తున్నాయి. కాబట్టే బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 145 పరుగుల విజయ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. కాబట్టి నేటి మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది.

Updated Date - 2022-07-31T21:27:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising