ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్ ఇంతకీ ఓపెనరా? మిడిలార్డర్ బ్యాటరా?: అజిత్ అగార్కర్

ABN, First Publish Date - 2022-02-02T00:19:57+05:30

భారత జట్టులో కేఎల్ రాహుల్ అసలు ఓపెనరా? మిడిలార్డర్ బ్యాటరా? అన్న విషయాన్ని జట్టు తొలుత తేల్చుకోవాల్సిన అవసరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: భారత జట్టులో కేఎల్ రాహుల్ అసలు ఓపెనరా? మిడిలార్డర్ బ్యాటరా? అన్న విషయాన్ని జట్టు తొలుత తేల్చుకోవాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ అన్నాడు. జట్టు తొలుత తెలుసుకోవాల్సిన విషయం ఇదేనని పేర్కొన్నాడు.


ఎందుకంటే దక్షిణాఫ్రికా సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడని గుర్తు చేశాడు. ఇది తనను కొంత నిరుత్సాహానికి గురిచేసిందని అన్నాడు. ఎందుకంటే అతడు 4 లేదంటే 5 నంబర్‌లో విజయవంతంగా రాణిస్తున్నాడని ‘స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. 


అలా కాదు, ఓపెనర్‌గానే ఉండాలనుకుంటే దానికే కట్టుబడి ఉండాలని అగార్కర్ పేర్కొన్నాడు. అప్పుడు రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చన్నాడు. అయితే, ఇప్పటికే శిఖర్ ధవన్ ఆ ప్లేస్‌లో ఉండడంతో అతడి పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారుతుందన్నాడు.


దక్షిణాఫ్రికాలో శిఖర్ ధవన్ పరుగులు సాధించినప్పటికీ ఏడాది, ఏడాదిన్నర తర్వాత అతడు ఎక్కడ ఉంటాడన్నది తెలియదని అన్నాడు. కాబట్టి ఇషాన్ కిషన్, రిషభ్ పంత్ వంటి ఎక్స్‌ప్లోజివ్ ఆటగాళ్లు కావాలని పేర్కొన్నాడు. అతడికి టాపార్డర్‌లో స్థానం ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుందో, లేదో ఎవరికి తెలుసని అజిత్ అగార్కర్ వివరించాడు.

Updated Date - 2022-02-02T00:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising