ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

South Africa vs India: 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

ABN, First Publish Date - 2022-01-03T21:09:22+05:30

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జొహన్నెస్‌లో నేడు ప్రారంభమైన రెండో టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడినట్టు కనిపిస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జొహన్నెస్‌బర్గ్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జొహన్నెస్‌బర్గ్‌లో నేడు ప్రారంభమైన రెండో టెస్టులో భారత జట్టు తడబడుతోంది. 49 పరుగులకే  మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 36 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ (26) అగర్వాల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.


ఆ స్కోరుకు 13 పరుగులు జోడించిన తర్వాత చతేశ్వర్ పుజారా (3) అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే మరోమారు దారుణంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. ఫలితంగా 49 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 


మరోవైపు, సఫారీ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లలో రెండు ఒలివియర్‌కు దక్కాయి. మార్కో జాన్సెన్‌ ఒక వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ కేఎల్ రాహుల్ (19), హనుమ విహారి (2) క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2022-01-03T21:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising