ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరుచుకుపడుతున్న పంత్.. పరుగులు పెడుతున్న స్కోరు

ABN, First Publish Date - 2022-03-04T21:47:09+05:30

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలీ: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇక్కడి పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ 75 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికిది 8వ అర్ధ సెంచరీ. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత పంత్ బ్యాట్ ఝళిపించాడు. మరో 3 సిక్సర్లు, 3 ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటాడు. దీంతో స్కోరు ఒక్కసారిగా పరుగులు పెట్టింది. 


టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జట్టుకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్ (33), రోహిత్ శర్మ (29) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. హనుమ విహారీ అర్ధ సెంచరీతో జట్టును నిలబెట్టగా, వందో టెస్టు ఆడుతున్న విరాట్ కోహ్లీ 45 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (27) కూడా క్రీజులో కుదురుకోవడంలో విఫలమయ్యాడు.


పంత్ 82 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు., జడేజా 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో లసిత్ రెండు వికెట్లు తీసుకోగా, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, డి సిల్వ చెరో వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2022-03-04T21:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising