ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IND vs WI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. టీమిండియాలో ఇవాళ వాళ్లు బాగా ఆడాల్సిందే.. లేకపోతే..

ABN, First Publish Date - 2022-07-25T00:22:34+05:30

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ జట్టులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌: వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. విండీస్ జట్టులో మోతీ స్థానంలో హేడెన్ వాల్ష్ ఆడనున్నాడు. టీమిండియాలో ప్రసీద్ కృష్ణ స్థానంలో అవీష్ ఖాన్‌కు అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అవీష్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే అభిమానులను ఉర్రూతలూగించింది. ఆఖరి బంతి వరకు ఇరుజట్లకు సమాన అవకాశం కనిపించగా.. పేసర్‌ సిరాజ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు కీపర్‌ శాంసన్‌ అప్రమత్తతతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. ఇక ఇవాళ క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌ మైదానంలోనే జరగనున్న రెండో వన్డేలో ధవన్‌ సేన గెలిస్తే సిరీస్‌ వశమవుతుంది. కానీ ఈ కీలక మ్యాచ్‌లో మిడిలార్డర్‌ ఆటతీరు మారాల్సి ఉంది.



ఆరంభ మ్యాచ్‌లో టాపార్డర్‌ అద్భుతంగా ఆదుకుంది. కానీ ఆ తర్వాత బ్యాటర్లు విండీస్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కోలేకపోయారు. నేటి మ్యాచ్‌లో మధ్య ఓవర్లలోనూ స్కోరును పరిగెత్తిస్తూ విండీస్‌ను చిత్తు చేయాలనుకుంటోంది. మరోవైపు ఆతిథ్య విండీస్‌ మాత్రం అంచనాలకు మించే ఆడింది. తాము అనుకున్నట్టుగానే నిర్ణీత ఓవర్లను పూర్తిగా ఆడడంతో పాటు భారత్‌కు ఓటమి భయాన్ని రుచి చూపింది. సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే ఆదివారం నాటి మ్యాచ్‌లో విండీస్‌ గెలవాల్సిందే. భారత్‌ చివరిసారి ఇక్కడ ఆడినప్పుడు మూడు వన్డేల సిరీస్‌ను 2-0తో గెల్చుకోగా.. ఆఖరి మ్యాచ్‌ వర్షంతో రద్దయ్యింది.



ఓపెనర్లు ధవన్‌, గిల్‌ మెరుపు ఆటతీరుతో తొలి వన్డేలో భారత్‌ భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా 19 నెలల విరామం తర్వాత వన్డే ఆడిన గిల్‌ తనకు లభించిన ఛాన్స్‌ను వినియోగించుకున్నాడు. కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకుంటూ బంతికో పరుగు చొప్పున సాధించాడు. శ్రేయాస్‌ కూడా ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. అయితే టాపార్డర్‌ పెవిలియన్‌కు చేరాక మిడిలార్డర్‌ తడబాటుతో భారత్‌ ఆశించినట్టుగా 350 పరుగులు చేయలేకపోయింది. శాంసన్‌ తనకు దక్కిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. అయితే కీపర్‌గా మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక సూర్యకుమార్‌, దీపక్‌ హుడా బ్యాట్లు ఝుళిపించాల్సి ఉంది.


టీమిండియా: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, చాహల్, అవీష్ ఖాన్


వెస్టిండీస్: హోప్(వికెట్ కీపర్), బ్రాడన్ కింగ్, బ్రూక్స్, మేయెర్స్‌, నికోలస్ పూరన్(కెప్టెన్), పావెల్, హోసేన్‌, షెఫర్డ్‌, జోసెఫ్‌, సీల్స్‌, హేడెన్ వాల్ష్

Updated Date - 2022-07-25T00:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising