ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IND vs WI: వర్షం కారణంగా నిలిచిపోయిన టీమిండియా, వెస్టిండీస్ మూడో వన్డే..

ABN, First Publish Date - 2022-07-28T02:49:02+05:30

వెస్టిండీస్‌తో ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ వన్డే వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన సమయానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ వన్డే వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయిన సమయానికి 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ధావన్, శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీలు నమోదు చేశారు. ధావన్ 74 బంతుల్లో 7 ఫోర్లు కొట్టి 58 పరుగులు చేశాడు. హేడెన్ వాల్ష్ బౌలింగ్‌లో పూరన్‌కు క్యాచ్‌గా చిక్కడంతో ధావన్ పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. శుభ్‌మన్ గిల్ 65 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకొచ్చి రెండు పరుగులు చేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. వెస్టిండీస్ పై వరుసగా 12 వన్డే సిరీస్‌లు గెలిచిన విజయోత్సాహంలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు ఇప్పుడు తాజా సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనుకుంటోంది.



ఆద్యంతం ఉత్కంఠగా సాగిన తొలి రెండు వన్డేల్లో భారత్‌ ఆఖరి ఓవర్‌లో గట్టెక్కి 2-0తో సిరీస్‌ను దక్కించుకుంది. ఓసారి బౌలింగ్‌, మరోసారి బ్యాటింగ్‌ ప్రతిభతో ధవన్‌ సేన విండీస్‌ ఆశలను ఆవిరి చేసింది. విండీస్‌ ఈ సిరీస్‌లో 0-2తో వెనుకంజలో ఉన్నా గత మ్యాచుల్లో వారి పోరాటం ఆకట్టుకుంది. భారత బౌలింగ్‌ను ఎదుర్కొంటూ బ్యాటింగ్‌లో పూర్తి ఓవర్లు ఆడగలిగారు. అంతేకాకుండా విజయం అంచుల వరకూ వచ్చి ధవన్‌ సేనను వణికించారు. జట్టు పటిష్టంగానే కనిపిస్తున్నా సమష్టిగా రాణించాల్సిన అవసరముంది.

Updated Date - 2022-07-28T02:49:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising