ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Australia vs India: ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్‌లో దుమ్మురేపిన కేఎల్ రాహుల్, సూర్య.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే..

ABN, First Publish Date - 2022-10-17T17:11:19+05:30

బ్రిస్బేన్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. 187 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు నిలిపింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు 78 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. 33 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌లు బాదేసి 57 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. రాహుల్ 57 పరుగులు చేసి దూకుడుగా ఆడుతుండగా మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో అష్టన్ అగర్‌కు క్యాచ్‌గా చిక్కడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అగర్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు. కోహ్లీ 19 పరుగులకే స్టార్క్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కు క్యాచ్‌గా దొరికిపోయి ఔట్ అయ్యాడు. అయితే.. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో కూడా మెరిశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.



రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో బౌలర్‌కే క్యాచ్‌గా దొరికి ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో రిచర్డ్‌సన్ 4 వికెట్లతో రాణించాడు. స్టార్క్, మ్యాక్స్‌వెల్, అగర్‌కు తలో వికెట్ దక్కింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా విజయావకాశాలను కొట్టిపారేయలేం. ఫించ్, మార్ష్, స్మిత్, మ్యాక్స్‌వెల్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్స్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. టీమిండియా బౌలర్లు పరుగులు రాకుండా కట్టడి చేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను బలహీనపరచాల్సిన అవసరం ఉంది. వార్మప్ మ్యాచే అయినప్పటికీ పాకిస్తాన్‌తో జరగబోయే కీలక మ్యాచ్‌లో టీమిండియా ఆటతీరును అంచనా వేసేందుకు ఈ మ్యాచ్ ఫలితం ఉపకరిస్తుంది. 

Updated Date - 2022-10-17T17:11:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising