ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐసీసీ ఎలిట్‌ అంపైర్‌.. దుస్తుల దుకాణం ఓనర్‌

ABN, First Publish Date - 2022-06-25T10:17:02+05:30

అసద్‌ రౌఫ్‌.. అంతర్జాతీయ అంపైర్‌గా 13 ఏళ్ల అనుభవం అతడిది. 2000 నుంచి 2013 వరకు మొత్తం 170 మ్యాచ్‌లకు అతడు అంపైరింగ్‌ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్‌: అసద్‌ రౌఫ్‌.. అంతర్జాతీయ అంపైర్‌గా 13 ఏళ్ల అనుభవం అతడిది. 2000 నుంచి 2013 వరకు మొత్తం 170 మ్యాచ్‌లకు అతడు అంపైరింగ్‌ చేశాడు. ఇందులో 49 టెస్ట్‌లు, 98 వన్డేలు, 23 టీ20లున్నాయి. ఐసీసీ ఎలిట్‌ ప్యానెల్‌ అంపైర్‌గా కూడా వ్యవహరించిన ఘనత అసద్‌ది. కానీ ప్రస్తు తం అతడు లాహోర్‌లోని లాండా బజార్‌లో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నాడు. తక్కువ ధరకు లభించే దుస్తులు, చెప్పులకు ఈ బజార్‌ ప్రసిద్ధి. పుష్కరానికిపైగా అంపైర్‌గా వ్యవహరించిన 66 ఏళ్ల రౌఫ్‌ 2013లో క్రికెట్‌ను వదిలేశాడు. ప్రస్తుతం ఆ ఆటపట్ల తనకు ఏమాత్రం ఆసక్తిలేదని స్పష్టంజేశాడు.


కారణం అడిగితే ‘నేను ఏదైనా వృత్తిని వదిలిస్తే దాని గురించి ఇక ఏమాత్రం పట్టించుకోను’ అని సమాధానమిస్తాడు. అన్నట్టు ఐపీఎల్‌లోనూ ఈ పాకిస్థానీ అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాడు. కాకపోతే..2013 ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ కుంభకోణంలో అసద్‌ పేరు కూడా వినిపించింది. బుకీలనుంచి అతడు ఖరీదైన బహుమతులు స్వీకరించాడని బీసీసీఐ ఆరోపించింది. అంతేకాదు..2016లో అతడిని ఐదేళ్లపాటు భారత బోర్డు బహిష్కరించింది. ‘ఆ విషయాలతో నాకెలాంటి సంబంధంలేదు. బీసీసీఐయే ఆరోపణలు చేసి నాపై చర్యలు తీసుకుంది’ అని అసద్‌ చెప్పాడు. అంతేకాదండోయ్‌..ముంబైకి చెందిన ఓ మోడల్‌ రౌఫ్‌పై సెక్సువల్‌ ఆరోపణలు చేసి సంచలనం రేపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి అతడు తనతో సుదీర్ఘకాలం లైంగిక సంబంధం పెట్టుకున్నాడని 2012లో ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలనూ అసద్‌ కొట్టి పడేశాడు. 

Updated Date - 2022-06-25T10:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising