ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాంపియన్‌కు వీడ్కోలు

ABN, First Publish Date - 2022-06-29T09:41:38+05:30

క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌కు ఏకైక వన్డే వరల్డ్‌క్‌పను అందించిన సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారికంగా రిటైర్మెంట్‌ ప్రకటించిన మోర్గాన్‌ 

లండన్‌: క్రికెట్‌కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లండ్‌కు ఏకైక వన్డే వరల్డ్‌క్‌పను అందించిన సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ ముగిసింది. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్టు, తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని 35 ఏళ్ల మోర్గాన్‌ మంగళవారం అధికారికంగా ప్రకటించాడు. ‘అన్ని వేళలా నాకు మద్దతిచ్చి ప్రోత్సహించినందుకు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు.


ఈ ప్రయాణంలో గొప్ప వ్యక్తులతో జ్ఞాపకాలను చిరకాలం గుర్తుంచుకుంటాను’ అని మోర్గాన్‌ తెలిపాడు. ఏడున్నరేళ్ల పాటు   పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్‌గా ఇంగ్లండ్‌ జట్టును అద్వితీయంగా నడిపించాడు. వన్డే, టీ20 ఫార్మాట్లలో ఇంగ్లండ్‌ను వరల్డ్‌ నెంబర్‌వన్‌గా నిలిపాడు. అతడి ఆధ్వర్యంలోనే జట్టు దూకుడైన ఆటతీరుతో ఇతర టీమ్స్‌కు మార్గదర్శకంగా నిలిచింది. 2016 టీ20 వరల్డ్‌క్‌పలో ఫైనల్‌కు చేర్చడంతో పాటు, 2019 వన్డే వరల్డ్‌క్‌పలో ఇంగ్లండ్‌ను చాంపియన్‌గా నిలిపిన ఘనత దక్కించుకున్నాడు. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌క్‌పలోనూ జట్టుకు టైటిల్‌ అందించాలని ఆశపడినా.. గాయాల సమస్యతోపాటు ఫామ్‌ కోల్పోవడంతో మోర్గాన్‌ పునరాలోచనలో పడ్డాడు.


ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన మూడు వన్డేల సిరీ్‌సలో మోర్గాన్‌ రెండుసార్లు డకౌటై.. ఆఖరి మ్యాచ్‌కు గాయంతో దూరమయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో అతని జట్టు వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు (498) చేయగలిగింది. 2014, డిసెంబరులో పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఎంపికైన అతను 126 వన్డేలు, 72 టీ20ల్లో జట్టును నడిపించాడు. 2006లో మోర్గాన్‌ ఐర్లాండ్‌ తరఫున కెరీర్‌ను ఆరంభించగా.. 2009 నుంచి ఇంగ్లండ్‌కు మారాడు. వన్డే, పొట్టి ఫార్మాట్లలో తమ జట్టు తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గానూ నిలిచాడు. అలాగే ఇంగ్లండ్‌ క్రికెట్‌ రూపురేఖలు మార్చేసిన క్రికెటర్‌గా మోర్గాన్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు కొనియాడింది. ఐసీసీ కూడా మోర్గాన్‌ సేవలను కొనియాడింది. 

Updated Date - 2022-06-29T09:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising