ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wimbledon కి Sania Mirza గుడ్‌బై.. భావోద్వేగంతో నోట్..

ABN, First Publish Date - 2022-07-07T23:58:53+05:30

ప్రపంచంలో పురాతన టెన్నీస్ టోర్నమెంట్ ‘వింబుల్డన్’(Wimbledon)కి ఇండియన్ టెన్నీస్ ఏస్ ప్లేయర్ సానియా మీర్జా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: డబ్ల్యూటీఏ(Women's Tennis Association) సర్క్యూట్‌లో తనకిదే చివరి ఏడాది అని ఇండియన్ టెన్నీస్ ఏస్ ప్లేయర్  సానియా మీర్జా(Sania Mirza)  ఇదివరకే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ప్రపంచంలో పురాతన టెన్నీస్ టోర్నమెంట్ ‘వింబుల్డన్’(Wimbledon)కి గుడ్‌బై చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాలో గురువారం భావోద్వేగంతో ఒక నోట్‌ను షేర్ చేసింది. బుధవారం జరిగిన మహిళల మిక్స్‌డ్-డబుల్స్‌ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓటమి అనంతరం సానియా ఈ నోట్ పోస్ట్ చేసింది. 


కాగా ఈ ఏడాది చివరిలో కెరీర్‌కి గుడ్‌బై చెప్పాలని సానియా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కాగా 2015 వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌ను సానియా జోడి గెలుచుకుంది. అయితే ఈ ఏడాది సీజన్‌లో కేవలం సెమీ ఫైనల్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియా తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఏం చెప్పిందో చూద్దాం..


‘‘ మానసికంగా, భౌతికంగా, భావోద్వేగం పరంగా టెన్నీస్ నన్నెంతో అలసటకు గురిచేసింది. గెలుపులు.. విజయాలు.. గంటల కొద్దీ శ్రమ, జీర్ణించుకోలేని ఓటములు ఎదురైనప్పుడు నిద్రలేని రాత్రులు. ఫలితంగా ఏ ఉద్యోగంలోనూ సాధించలేని ఎంతో పొందాను. అందుకు నేనెంతో రుణపడి ఉన్నాను. కన్నీళ్లు, సంతోషం.. పోరాటాలు.. వీటన్నింటికీ ముగింపు పలకాల్సి ఉంటుంది. ఈసారి వింబుల్డన్‌లో ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలాను. 20 ఏళ్లుగా ఇక్కడ ఆడిన మ్యాచ్‌లు, విజయాలను కోల్పోబోతున్నాను. ఐ విల్ మిస్ యూ ’’ అని సానియా పేర్కొంది.

Updated Date - 2022-07-07T23:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising