ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మట్టి కోర్టులపై నైట్ సెషన్సా?.. నాకు ఇష్టం ఉండదు: రఫెల్ నాదల్

ABN, First Publish Date - 2022-05-29T00:54:50+05:30

టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నైట్ సెషన్స్‌పై మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్: టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నైట్ సెషన్స్‌పై మాట్లాడుతూ.. అవంటే తనకు ఎంతమాత్రమూ ఇష్టముండదని వ్యాఖ్యానించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో గతేడాది నైట్‌ సెషన్స్‌ను ప్రవేశపెట్టారు. లైట్లు, ముడుచుకునే పైకప్పు కలిగిన రీఫర్‌బిష్‌డ్ కోర్టు ఫిలిప్ చాట్రియర్‌లో గతేడాది నైట్ సెషన్స్‌ను తీసుకొచ్చారు. ఈ ఏడాది 10 మ్యాచ్‌లను షెడ్యూల్ చేశారు. 15 వేల సీట్లున్న స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన కోరెంటిన్ మౌటెట్‌ను నాదల్ వరుస సెట్లలో మట్టికరిపించాడు. 6-3, 6-1, 6-4తో ఈజీ విక్టరీ సాధించాడు. మ్యాచ్ రాత్రి 11 గంటలకే ముగిసింది.


అయితే, తాను నైట్ సెషన్స్ కంటే పగటి సెషన్స్‌ను ఇష్టపడతానని 13సార్లు ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలుచుకున్న నాదల్ చెప్పుకొచ్చాడు. ‘‘మట్టి కోర్టుల్లో రాత్రి సెషన్స్‌ నాకు ఇష్టం ఉండదు. రాత్రి సమయాల్లో క్లే కోర్టులో ఆడడం నచ్చదు. ఎందుకంటే ఆ సమయంలో తేమ చాలా ఎక్కువగా ఉంటుంది. బంతి నెమ్మదిస్తుంది. ఇక, చల్లగా ఉంటే పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయి’’ అని ఈ స్పానిష్ స్టార్ చెప్పుకొచ్చాడు. టెన్నిస్ ఉదయం ఆడడానికి, రాత్రి ఆడడానికి మధ్య చాలా తేడా ఉంటుందన్నాడు. నాదల్ గతేడాది ఒక్కే ఒక్క నైట్ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో రిచర్డ్ గాస్క్వెట్‌ను వరుస  సెట్లలో ఓడించాడు. గ్రాండ్‌స్లామ్స్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్‌లో నైట్ సెషన్స్ అనేవి సర్వసాధారణం.  

Updated Date - 2022-05-29T00:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising