ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

World Badminton Championships: స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం.. వరల్డ్ నెం-2 కెంటో మోమోటాపై తిరుగులేని విజయం

ABN, First Publish Date - 2022-08-25T00:50:07+05:30

బీడబ్ల్యూఎఫ్(Badminton World Fedaration) వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో(World Championships) ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో : బీడబ్ల్యూఎఫ్(Badminton World Fedaration) వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో(World Championships) ఇండియన్ స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్(HS Prannoy) మెరిశాడు. రెండు సార్లు మాజీ ఛాంపియన్, వరల్డ్ నెంబర్-2 జపాన్ ఆటగాడు కెంటో మోమోటా(kento momota)ను రౌండ్-32లో మట్టికరింపించాడు. ఆరంభం నుంచీ దూకుడు ప్రదర్శించి వరుస సెట్లలో 21-17, 21-16 తేడాతో విజయబావుటా ఎగురవేశాడు. దీంతో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కెంటో మోమోటో టోర్నీ నుంచి అనూహ్యరీతిలో నిష్ర్కమించాడు.


మ్యాచ్‌ ఆసాంతం ఆకట్టుకున్న హెచ్ఎస్ ప్రణయ్ ఎక్కడా వెనుకడుగువేయలేదు. ప్రణయ్ అద్భుత నైపుణ్య ప్రదర్శన ముందు ఆశ్చర్యపోవడమే కెంటో మోమోటా వంతయ్యింది. ప్రత్యర్థిని ఆరంభం నుంచే కుదురుకోకుండా ప్రణయ్ జాగ్రత్తగా రాణించాడు. మోమోటా తప్పిదాలను అవకాశాలుగా మలుచుకున్నాడు. ప్రణయ్ ఎటాక్, డిఫెన్స్‌ కలయికతో ఆడడంతో మోమోటా కొన్ని పొరపాట్లు చేశాడు. ఈ అవకాశాలను పాయింట్లుగా మలుచుకోవడంలో ప్రణయ్ విజయవంతమయ్యాడు. మ్యాచ్ ఆసాంతం ప్రణయ్ ఆధిపత్యం కొనసాగింది. కొన్ని ర్యాలీలు ఎక్కువసేపు కొనసాగినప్పటికీ ప్రణయ్‌‌దే పైచేయిగా నిలిచింది. కాగా ఈ విజయంతో ప్రణయ్ చక్కటి ఆత్మవిశ్వాసంతో తదుపరి రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. తర్వాతి మ్యాచ్ గెలిస్తే ప్రణయ్ క్వాటర్ ఫైనల్స్‌కు చేరుకుంటాడు.

Updated Date - 2022-08-25T00:50:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising