ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: భారత్‌తో మ్యాచ్‌ ముగిసిన వెంటనే.. స్టేడియంలో గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్

ABN, First Publish Date - 2022-09-01T21:45:33+05:30

ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 40 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-4లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో హాంకాంగ్(Hong Kong) ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ఏకపక్షంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో హాంకాంగ్ పోరాట పటిమ అందరినీ ఆకట్టుకుంది. భారత బౌలర్ల పదునైన బంతులకు ఎదురొడ్డి నిలిచిన హాంకాంగ్ బ్యాటర్లు శభాష్ అనిపించుకున్నారు. 


మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో ఆసక్తికర సంఘటన ఒకటి జరిగింది. హాంకాంగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కించిత్ షా (Kinchit Shah) స్టాండ్స్‌లోకి వెళ్లి తన గాళ్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కించిత్ షా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నేరుగా స్టాండ్స్‌లో వెళ్లిన కించిత్ అక్కడ నిలబడి ఉన్న తన గాళ్ ఫ్రెండ్ భుజం తట్టాడు. ఆపై మోకాళ్లపై కూర్చుని బాక్స్‌లోంచి ఉంగరం తీసి ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడిగాడు. 


అంతే, ఈ హఠాత్ పరిణామం నుంచి తేరుకునేందుకు ఆమెకు చాలా సమయమే పట్టింది. క్షణకాలంపాటు తనను తాను నమ్మలేకపోయింది. కాసేపటి తర్వాత తేరుకుని ‘యస్’ అంటూ తన అంగీకారం తెలిపింది. ఆ మాట వినగానే పైకి లేచి ఆనందంతో తన చేతిలోని ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ తర్వాత ఇద్దరూ కౌగిలించుకుని ఆనంద డోలికల్లో తేలియాడిపోయారు. ఇదంతా చూస్తున్న స్టేడియంలోని అభిమానులు తమ సెల్‌ఫోన్లను క్లిక్‌మనించారు. కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆసియా కప్‌ను నిర్వహిస్తున్న ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ వారికి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. ఈ ఒక్క వీడియోతో కించిత్ షా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. 




Updated Date - 2022-09-01T21:45:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising