ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుజారా, రహానే ఘోర వైఫల్యం.. విరుచుకుపడుతున్న అభిమానులు

ABN, First Publish Date - 2022-01-04T00:44:47+05:30

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమింండియా సీనియర్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, మాజీ వైస్ కెప్టెన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా సీనియర్ బ్యాటర్లు చతేశ్వర్ పుజారా, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే మరోమారు దారుణంగా విఫలమయ్యారు. పుజారా మూడు పరుగులు చేసి అవుట్ కాగా, రహానే గోల్డె‌న్ డక్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరూ  గత రెండేళ్లుగా విఫలమవుతూ వస్తున్నా జట్టులో మాత్రం చోటు దక్కించుకుంటున్నారు.


2020, 2021లో పుజారా సగటు వరుసగా 20.37, 30.42గా ఉంది. రహానే 2019 నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్క సెంచరీ నమోదు చేశాడు. అతడి సగటు 40 లోపే పరిమితమైంది. పుజారా మాత్రం జనవరి 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 


రెండో టెస్టులో దారుణ వైఫల్యం తర్వాత వీరద్దరిపై అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వీరిద్దరికీ ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచి తర్వాతి టెస్టులకైనా వారి స్థానంలో యువకులకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం వీరిద్దరినీ తప్పించి శ్రేయాస్ అయ్యర్‌కు చోటివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక మ్యాచ్‌లో 50 పరుగులు చేసి తర్వాతి నాలుగైదు టెస్టుల కోసం జట్టులో స్థానం సంపాదించుకోవడం సిగ్గుచేటని దుమ్మెత్తి పోస్తున్నారు. 

Updated Date - 2022-01-04T00:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising