ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధిపత్యం కొనసాగాలి..

ABN, First Publish Date - 2022-10-07T09:01:41+05:30

ఆసియా కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న హర్మన్‌సేన టోర్నీలో కీలక పోరుకు సిద్ధమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాక్‌తో భారత్‌ పోరు నేడు

మహిళల ఆసియా కప్‌

(మ. 1.00 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో)


సిల్హెట్‌: ఆసియా కప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న హర్మన్‌సేన టోర్నీలో కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన భారత్‌..ఆరు పాయింట్లతో పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. టీ20 ఫార్మాట్‌లో చివరి ఐదుసార్లూ పాకిస్థాన్‌పై భారత్‌ విజయభేరి మోగించడం విశేషం. ఇక..ఒక్కో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న స్టార్‌ ఓపెనర్లు షఫాలీ వర్మ, స్మృతి మంధాన పాక్‌తో పోరులో ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నారు. కెప్టెన్‌ కౌర్‌, జెమీమా రోడ్రిగ్స్‌ అద్భుత ఫామ్‌లో ఉండడంతో టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది. మూడు మ్యాచ్‌ల్లోనూ బౌలర్లు చక్కగా రాణించడం మరో సానుకూలాంశం. 


పాక్‌కు థాయ్‌లాండ్‌ షాక్‌..:

గురువారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో పసికూన థాయ్‌లాండ్‌ పాకిస్థాన్‌పై సంచలన విజయం నమోదు చేసింది. తొలుత పాక్‌ 20 ఓవర్లలో 116/5 స్కోరుకే పరిమితమైంది. సిద్రా అమీన్‌ (56) హాఫ్‌ సెంచరీతో సత్తా చాటింది. అనంతరం థాయ్‌లాండ్‌ 19.5 ఓవర్లలో 117/6 స్కోరు చేసి గెలుపొందింది. చాంథమ్‌ (61) అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 88 రన్స్‌తో మలేసియాపై నెగ్గింది. 

Updated Date - 2022-10-07T09:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising