ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mohali Test: విహారి అర్ధ శతకం.. కోహ్లీకి తృటిలో చేజారిన హాఫ్ సెంచరీ

ABN, First Publish Date - 2022-03-04T18:54:31+05:30

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు‎లో తెలుగు ఆటగాడు హనుమా విహారి అదరగొడుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు‎లో తెలుగు ఆటగాడు హనుమా విహారి అదరగొడుతున్నాడు. చాలా రోజుల తర్వాత తిరిగి టెస్టుల్లో చోటు దక్కించుకున్న విహారి అద్భుత ప్రదర్శనతో అర్ధ శతకం నమోదు చేశాడు. 93 బంతుల్లో 5 బౌండరీల సహాయంతో విహారి హాఫ్ సెంచరీ కొట్టాడు. అటు వందో టెస్టు ఆడుతున్న కోహ్లీ తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లసిత్‌ ఎంబుల్డెనియా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(29), మయాంక్ అగర్వాల్(33) శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అనంతరం జట్టు స్కోర్ 80 పరుగుల వద్ద మయాంక్ పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, విహారితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడీ 92 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం అందించింది. ప్రస్తుతం భారత్ స్కోర్: 170/3(44 ఓవర్లు). క్రీజులో విహారి(56), పంత్(0) ఉన్నారు.     

Updated Date - 2022-03-04T18:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising