ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

zimbabwe vs india : క్రికెట్ ప్రపంచానికి గుడ్‌న్యూస్..

ABN, First Publish Date - 2022-08-17T01:38:46+05:30

జింబాబ్వేపై (zimbabwe) భారత్(India) ఆడడం క్రికెట్ ప్రపంచానికి శుభవార్త అని టీమిండియా బ్యాట్స్‌మెన్ శిఖర్ ధనవ్ వ్యాఖ్యానించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరారే : జింబాబ్వేపై (zimbabwe) భారత్(India) ఆడడం క్రికెట్ ప్రపంచానికి శుభవార్త అని టీమిండియా బ్యాట్స్‌మెన్ శిఖర్ ధనవ్ (shikar Dhavan) వ్యాఖ్యానించాడు. మెరుగైన జట్టుపై ఆడడం జింబాబ్వే ఆటగాళ్లకి చాలా ముఖ్యమని చెప్పాడు. జింబాబ్వే జట్టు గెలవడం ప్రారంభిస్తే ఆటగాళ్లకు గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. జింబాబ్వేలో ప్రతిఆటగాడికీ ప్రణాళిక రూపొందించుకుని బరిలోకి దిగుతామని చెప్పాడు. ముఖ్యంగా సికందర్ రాజా ఎప్పటి నుంచో ఆడుతున్నాడని, నాణ్యమైన ఈ ఆటగాడి కోసం పక్కా ప్రణాళికతో ఆడతామన్నాడు.


భారత జట్టు విషయానికి వస్తే.. టీ20 వరల్డ్ కప్‌నకు ముందు ఈ సిరీస్ చాలా ముఖ్యమని ధవన్ పేర్కొన్నాడు. యువఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న తమకు కూడా ఈ సిరీస్ కీలకమైనదేనని అన్నాడు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ పునరాగమనం తర్వాత అతడికి ఈ సిరీస్ చాలా కీలకమని పేర్కొన్నాడు. త్వరలోనే కీలకమైన ఆసియా కప్ జరగబోతుండడంతో ఈ సరీస్ కేఎల్ రాహుల్‌కు ముఖ్యమని పేర్కొన్నాడు. వన్డే మ్యాచ్‌లు ఆడడాన్ని ఇష్టపడతానని తెలిపాడు. సిరీస్ ఆరంభానికి 2 రోజుల ముందు వైస్ కెప్టెన్ శిఖర్ ధవన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈవిధంగా స్పందించాడు. టీమిండియా సన్నద్ధత, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి అడుగుపెట్టడం వంటి అంశాలపై స్పందించాడు. 

 

కాగా భారత్ - జింబాబ్వే (zimbabwe vs india) మధ్య 3 వన్డేల సిరీస్ గురువారం నుంచి ఆరంభవనుంది. కేఎల్ రాహుల్ (KL Rahul) సారధ్యంలో టీమిండియా ఈ సిరీస్ ఆడనుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వీరిద్దరి సారధ్యంలోని టీమిండియా ఆతిథ్య జింబాబ్వేపై ఎలా రాణించనుందనే ఆసక్తి నెలకొంది. 


వాషింగ్టన్ సుందర్ స్థానంలో షాబాజ్ అహ్మద్..

జింబాబ్వే టూర్‌కి ఎంపికైన వాషింగ్టన్ సుందర్‌ భుజం గాయంపాలయ్యాడు. దీంతో అతడి స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి తీసుకున్నట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న సమయంలో వాషింగ్టన్ సుందర్‌కు గాయమైందని తెలిపింది.

Updated Date - 2022-08-17T01:38:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising