ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షార్జాలో గ్లోబల్ పీస్ లీగ్ నిర్వహణ * మరిన్ని దేశాల్లో నిర్వహిస్తామని నిర్వాహకుల వెల్లడి

ABN, First Publish Date - 2022-04-12T01:11:41+05:30

స్పోర్ట్స్ నెక్ట్స్ ఆధ్వర్యంలో దుబాయ్లలోని షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్లోబల్ పీస్ లీగ్(జీపీఎల్) జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షార్జా : స్పోర్ట్స్ నెక్ట్స్ ఆధ్వర్యంలో దుబాయ్లలోని షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో గ్లోబల్ పీస్ లీగ్(జీపీఎల్) జరిగింది. స్పోర్ట్స్ నెక్స్ట్ చైర్మన్ సరికొండ వినయ్ కుమార్ రెడ్డి(ఎస్వీఆర్), సీఈఓ నీల్ సావంత్. ప్రధాన కమిటీ సభ్యులు ఆసిఫ్ ఠాకూర్, వెంకటేశ్వర స్వామి, నరేందర్, రవి, చంద్రమౌళి, రాహుల్ తదితర ప్రముఖులు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొన్నారు. స్పోర్ట్స్ నెక్స్ట్ అన్నది ‘స్పోర్ట్స్ త్రూ ఎడ్యుకేషన్’ ట్యాగ్‌లైన్‌తో వచ్చింది. క్రీడలు, విద్య, పర్యాటక రంగాలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యాలు.


వంద శాతం క్రికెట్ ఇనీషియేటివ్ ఆఫ్ ది ఇయర్ ఫిజికల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం, లేదా... డిజిటల్ డెలివరీ చేసిన గేమ్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ ద్వారా గేమ్‌ను ప్రోత్సహించే క్రమంలో...  అసోసియేట్ సభ్యుడు అందించిన అత్యుత్తమ క్రికెట్ ఫోకస్డ్ చొరవను ఈ వేదిక  గుర్తించినట్లుగా ఎస్ వీ కే పేర్కొన్నారు. కాగా... డాబా మొడిబో కేటియా టైక్వాండోకు ప్రపంచ ఛాంపియన్, స్పోర్ట్స్ నెక్స్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. టైస్ మిస్ ఉక్రెయిన్, స్పోర్ట్స్ నెక్స్ట్(మహిళలు) బ్రాండ్ అంబాసిడర్... జీపీఎల్ లో పాల్గొన్న జట్లు...  ఎరియం, శుభ్, సూపర్ 6, ప్రైడ్ మూన్, జీసీఎం, బిగ్ బుల్, బిటెంజెన్, సెగమా, డేటా బాస్ అండ్ క్వాంటం కోర్.


కాగా... క్రీడాకారులు తమ తల్లిదండ్రులతో సహా వచ్చి మరీ ఈ  లీగ్‌ను ఆస్వాదించడం విశేషం. ఈ కార్యక్రమం సందర్భంగా... బేసిక్ సర్టిఫైడ్ కోర్సులతో క్రీడాకారులకు అవగాహన కల్పించడంతో పాటు క్రీడాకారులకు సర్టిఫికెట్లనందించడం విశేషం. షార్జా ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, స్కైలైన్ యూనివర్సిటీ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. కాగా... తల్లిదండ్రులు, స్నేహితులతో వచ్చిన క్రీడాకారులు... దుబాయ్, షార్జా, అబుదాబిల్లో పర్యటించారు. ఆటగాళ్లు భారతీయ ఆహారం & స్టార్ యాంబియన్స్ వసతిని ఆస్వాదించారు.





స్పోర్ట్స్ నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు సంధించి రాబోయే విద్యార్థుల కోసం క్రీడలు, విద్య & పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తోంది. ఈ క్రికెట్ మ్యాచ్‌లను భారత్, యూరప్‌లోని అన్ని పెద్ద క్రీడలు, క్రికెట్ సంస్థలు ప్రోత్సహిస్తూండడం విశేషం. కాగా... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం స్పోర్ట్స్ నెక్స్ట్ కోసం ప్రోత్సాహకాలనందిస్తోంది. ఐసీసీ, బీసీసీఐ సహా పెద్దసంఖ్యలో స్పాన్సరర్‌లు స్పోర్ట్స్ నెక్స్ట్‌తో ఈ సందర్భంగా సంప్రదిస్తుండడం గమనార్హం.


ఇక... ప్రపంచవ్యాప్తంగా పిల్లల అభివృద్ధి కోసం మరిన్ని మ్యాచ్‌లను నిర్వహించాలని ఆయా సంస్థలు కోరడం గమనార్హం. ఇప్పుడు స్పోర్ట్స్ నెక్స్ట్... ఇండియా, యూరోప్ ల లోని పలు విశ్వవిద్యాలయాలు, పాఠశాలలకు బ్రాండ్ గా మారిందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి. ‘మేం దుబాయ్‌లో క్రీడలు, విద్య, పర్యాటక రంగాలను ప్రోత్సహిస్తాం. అంతేకాకుండా... మేం... ప్రపంచమంతటా నెమ్మదిగా వ్యాప్తి చెందుతాం’ అని ఎస్వీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మేము వివిధ కోర్సుల్లో మిలియన్ల మంది విద్యార్థులకు అవగాహన కల్పించనున్నామని, అంతేకాకుండా... వివిధ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తామని వెల్లడించారు. రాబోయే విద్యార్థుల కోసం యూఏఈ ప్రభుత్వం పూర్తి మద్దతునిచ్చిందని వెల్లడించారు. యూఏఈ ప్రభుత్వానికి ఎస్వీఆర్, నీల్ సావంత్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే మ్యాచ్‌లను ‘మే’లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఎస్వీఆర్, నీల్ సావంత్ వెల్లడించారు. ఆయా క్రీడలను తమ దేశాల్లో కేూడా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయా దేశాలు కోరడం గమనార్హం. కాగా... శుభ్ గ్రూప్ & ప్రైడ్ మూన్ ఈ లీగ్‌ని స్పాన్సర్ చేసాయి. ప్లే స్టోర్ & యాపిల్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకునే స్పోర్ట్స్ తదుపరి యాప్‌లో లైవ్ స్కోర్‌ను చూడవచ్చునని ఎస్వీఆర్ వెల్లడించారు. 

Updated Date - 2022-04-12T01:11:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising