ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాంటి బౌలింగును మీరెప్పుడూ చూసి ఉండరు!

ABN, First Publish Date - 2022-06-25T02:30:34+05:30

క్రికెట్ ప్రేమికులు రకరకాల బౌలింగును చూసి ఉంటారు. అత్యంత వేగంగా బౌలింగ్ వేసి రికార్డులు సృష్టించేవారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: క్రికెట్ ప్రేమికులు రకరకాల బౌలింగును చూసి ఉంటారు.  అత్యంత వేగంగా బౌలింగ్ వేసి రికార్డులు సృష్టించేవారు కొందరతే, స్పిన్నర్లుగా అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకునేవారు కొందరు. ఇప్పుడు చెప్పుకోబోయే బౌలర్ ఈ రెండింటిలో దేనికీ చెందడు. కానీ బౌలరే. వేగంగా పరిగెత్తడు కాబట్టి పేసర్ కాదు. నెమ్మదిగా వచ్చి బంతిని విసిరే స్పిన్నరూ కాదు. కానీ అతడు స్పిన్నరేనట. అతడి బౌలింగును చూసిన నెటిజన్లు చెబుతున్న మాట ఇది. 


క్రీజు వద్దకు వచ్చి నిల్చుని ఎడమ చేయిని పైకి లేపుతాడు. ఆపై వామప్ చేస్తున్నట్టు కాళ్లను అటూ ఇటూ కదిపి ఆ తర్వాత బంతిని విసిరుతాడు. ఆ తర్వాత మోకాళ్లుపై చేతులు ఉంచి చూస్తాడు. అదీ అతడి బౌలింగ్ స్టైల్. విభిన్నమైన బౌలింగ్ శైలితో వార్తల్లోకి ఎక్కిన ఆ బౌలర్ పేరు జార్జ్ మెక్ మెనెమీ. ఇంగ్లండ్ విలేజ్ క్రికెట్‌లో ఆడుతుంటాడు. తాను బౌలింగ్ చేస్తున్న వీడియోను అతడే స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేశాడు.


‘‘నేను మూర్ఖుడిని కావొచ్చు.  ప్రపంచంలోనే చెత్త క్రికెటర్‌ని కూడా కావచ్చు. కానీ ఈ క్రీడ నా జీవితాన్ని కాపాడింది. నా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. మరోసారి సంతోషంగా ఉండటానికి దోహదపడింది. స్వర్గంలో ఉన్న మమ్మీ గర్వించేలా చేయడానికి నాకు ఒక వేదికను ఇచ్చింది. క్రికెట్ ఐ లవ్యూ’’ అని రాసుకొచ్చాడు. ఈ వీడియోను చూసిన వారు ‘ఇదేందయ్య ఇది.. ఇలాంటి బౌలింగ్‌ను మేమెప్పుడూ చూళ్లే’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూసేయండి మరి. 



Updated Date - 2022-06-25T02:30:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising