ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Asad Rauf: అయ్యో పాపం.. క్రికెట్‌లో ఈ అంపైర్ తెలియని వారుండరు.. గుండెపోటు పొట్టనపెట్టుకుంది..

ABN, First Publish Date - 2022-09-15T16:03:15+05:30

క్రికెట్‌ అభిమానులను గురువారం ఉదయాన్నే ఓ వార్త విషాదంలోకి నెట్టేసింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన పాకిస్తానీ మాజీ అంపైర్ అసద్ రౌఫ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్: క్రికెట్‌ అభిమానులను గురువారం ఉదయాన్నే ఓ వార్త విషాదంలోకి నెట్టేసింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు చెందిన పాకిస్తానీ మాజీ అంపైర్ అసద్ రౌఫ్ (Asad Rauf Died) లాహోర్‌లో గుండెపోటుతో మరణించారు. 66 సంవత్సరాల రౌఫ్ (Umpire Asad Rauf Heart Attack) మొత్తం 64 టెస్టులకు (49 ఆన్‌-ఫీల్డ్ అంపైర్‌గా, 15 మ్యాచ్‌లకు టీవీ అంపైర్‌గా), 139 వన్డేలకు, 28 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. రౌఫ్ 2000వ సంవత్సరంలో తొలి వన్డే మ్యాచ్‌కు, 2005వ సంవత్సరంలో తొలి టెస్ట్ మ్యాచ్‌తో అంపైర్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌కు గుర్తింపు పొందిన ఆయన 2013 వరకూ అంపైర్‌గా కొనసాగారు. 40 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు, 26 లిస్ట్-ఏ మ్యాచ్‌లకు.. ఐపీఎల్ మ్యాచ్‌లతో కలిపి 89 టీ20 మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. 11 మహిళల టీ20 మ్యాచ్‌లకు కూడా అంపైర్‌గా పనిచేశారు. అంపైర్‌గానే కాదు మంచి బ్యాట్స్‌మెన్‌గా కూడా రౌఫ్‌కు ఉత్తమ రికార్డ్ ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రౌఫ్ 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3423 పరుగులు చేశారు. 40 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 611 పరుగులు చేశారు. రౌఫ్ మృతి పట్ల పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా, పాకిస్తాన్ క్రికెటర్ కమ్రన్ అక్మల్ ట్వీట్స్ చేశారు.



అసద్ రౌఫ్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని, అల్లా ఆయన కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని కమ్రన్ అక్మల్ ఆకాంక్షించారు. అసద్ రౌఫ్ గురించి ఇలాంటి వార్త వినాల్సి రావడం బాధాకరమని, ఆయన కేవలం ఒక ఉత్తమ అంపైర్ మాత్రమే కాదని.. తనదైన చమత్కారంతో అందరినీ నవ్వించేవారని రమీజ్ రాజా ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. రౌఫ్ చుట్టూ కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ 2013 సీజన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై 2016లో బీసీసీఐ నిషేధం విధించింది. ముంబైకి చెందిన మోడల్ లీనా కపూర్ తనను అసద్ రౌఫ్ లైంగికంగా లొంగదీసుకునేందుకు యత్నించాడని ఆరోపిస్తూ ఆమెతో రౌఫ్ చనువుగా ఉన్న ఒక ఫొటోను నెట్టింట పోస్ట్ చేయడంతో అప్పట్లో ఈ అంశం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-09-15T16:03:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising