ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

team for Zimbabwe tour : జింబాబ్వే టూర్‌కు ఆటగాళ్ల ఎంపిక.. కేఎల్ రాహుల్ చేతికి పగ్గాలు..

ABN, First Publish Date - 2022-08-12T03:21:22+05:30

జింబాబ్వే పర్యటనలో(Zimbabwe tour) 3 వన్డేల సిరీస్‌ ఆడనున్న భారత(India) జట్టును బీసీసీఐ(BCCI) గురువారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : జింబాబ్వే పర్యటనలో(Zimbabwe tour) 3 వన్డేల సిరీస్‌ ఆడనున్న భారత(India) జట్టును బీసీసీఐ(BCCI) గురువారం ప్రకటించింది. గాయం నుంచి కోలుకుని  పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్‌(KL Rahul) చేతికి జట్టు పగ్గాలు అప్పగిస్తూ సెలక్టర్లు నిర్ణయించారు. శిఖర్ ధవన్(Shikar Dhavan) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వాస్తవానికి జులై 30న బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్‌లో కేఎల్ రాహుల్ పేరు లేదు. అయినప్పటికీ గురువారం ప్రకటించిన తాజా జాబితాలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కేఎల్ రాహుల్‌ని పరిశీలించిన బీసీసీఐ మెడికల్ టీం.. రానున్న జింబాబ్వే వన్డే సిరీస్‌లో ఆడొచ్చని క్లియరెన్స్ ఇచ్చిందని పేర్కొంది. ఇందుకు అనుగుణంగానే ఆల్-ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్టు వివరించింది. దీంతో సౌతాఫ్రికా సిరీస్‌కు ముందు గాయపడ్డ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చినట్టయ్యింది. ఆసియా టీ20 కప్‌లోనూ కేఎల్ రాహుల్‌కి చోటుదక్కిన విషయం తెలిసిందే.  జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 18, 20, 22 తేదీల్లో భారత్ 3 వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.


భారత జట్టు : కేఎల్ రాహుల్(కెప్టెన్), శిఖర్ ధావన్(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ థాకూర్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహార్.

Updated Date - 2022-08-12T03:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising