ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టు బిగించిన న్యూజిలాండ్‌

ABN, First Publish Date - 2022-02-19T08:19:11+05:30

దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ పూర్తిగా పట్టుబిగించింది. 387 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన ఆతిథ్య కివీస్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రైస్ట్‌చర్చ్‌: దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌లో న్యూజిలాండ్‌ పూర్తిగా పట్టుబిగించింది. 387 పరుగుల మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన ఆతిథ్య కివీస్‌.. ప్రత్యర్థి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లనూ పడగొట్టింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ 116/3 స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 482 పరుగులకు ఆలౌటైంది. హెన్రీ నికోల్స్‌ (105) సెంచరీతో కదంతొక్కగా, బ్లండెల్‌ (96), మ్యాట్‌ హెన్రీ (58 నాటౌట్‌) అర్ధ శతకాలతో సత్తా చాటారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా రెండోరోజు ఆఖరికి 34/3తో కష్టాల్లో పడింది. 353 రన్స్‌ వెనుకంజలో ఉన్న సఫారీలకు 7 వికెట్లే చేతిలో ఉన్నాయి. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 95 రన్స్‌కే కుప్పకూలిన సంగతి తెలిసిందే. కాగా.. 7 వికెట్లు తీయడంతోపాటు హాఫ్‌ సెంచరీ చేసిన తొలి 11వ నెంబర్‌ బ్యాటర్‌గా హెన్రీ రికార్డు సృష్టించాడు. 

Updated Date - 2022-02-19T08:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising